SRH vs KKR, IPL 2021: ఐపీఎల్ 2021 లో ఆదివారం డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచులో కోహ్లీసేన 6 పరుగులతో విజయం సాధించింద. ఇక రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంల మధ్య దుబాయ్‌లో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ టీం తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 115 పరుగులు సాధించింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు 116 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. హైదరాబాద్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి బయటపడిన సంగతి తెలిసిందే. మరోవైపు కేకేఆర్ టీంకు మాత్రం చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో కోల్‌కతా టీం అద్భుతంగా ఆడింది. బౌలర్ల దెబ్బకు హైదరాబాద్ టీం ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.
హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో కేన్ విలియమ్సన్ 26 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఆ తరువాత అబ్దుల్ సమద్ 25, ప్రియం గార్గ్ 21, జాన్సన్ రాయ్ 10 పరుగులతో నిలిచారు. వీరు మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. మిగతా ప్లేయర్లు అంతా కేవలం సింగిల్ డిజిట్ వద్దే పెవిలియన్ చేరి నిరాశ పరిచారు. సాహా 0, అభిషేక్ శర్మ 6, జాన్సన్ హోల్డర్ 2, రషీద్ ఖాన్ 8 పరుగులు సాధించాడు. భువనేశ్వర్ 6, సిద్ధార్ద్ కౌల్ 3 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో టిం సౌతి, శివం మావి, వరుణ్ చక్రవర్తి తలో 2 వికెట్లు, షకిబ్ అల్ హసన్ ఒక వికెట్ పడగొట్టారు.
INNINGS BREAK!
Impressive bowling performance from @KKRiders against #SRH! ? ?
2⃣ wickets each for @chakaravarthy29, Tim Southee & @ShivamMavi23. ? ?
Stay tuned for #KKR chase. #VIVOIPL #KKRvSRH
Scorecard ? https://t.co/Z5rRXTNps5 pic.twitter.com/G303wuh2R1
— IndianPremierLeague (@IPL) October 3, 2021
ICYMI: Bull’s eye ? @Sah75official‘s fielding brilliance ? ?
The @KKRiders all-rounder pulled off a stunning run-out to dismiss Kane Williamson ? ? #VIVOIPL #KKRvSRH
Watch it here ? ?https://t.co/zAdAdLybah
— IndianPremierLeague (@IPL) October 3, 2021
Also Read: IPL 2021, RCB vs PBKS Match Result: ఉత్కంఠ మ్యాచులో కోహ్లీసేనదే విజయం.. ప్లే ఆఫ్‌కు చేరిన బెంగళూరు