Video: విరాట్ కోహ్లీకి ఎమోషనల్ ట్రిబ్యూట్ తెలిపిన BCCI.. చూస్తే కన్నీళ్లు ఆగడం లేదు భయ్యా!

భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు మే 12న వీడ్కోలు చెప్పాడు. బీసీసీఐ అతని సేవలను గుర్తిస్తూ హృద్యమైన వీడియోను విడుదల చేసింది. 68 టెస్టుల్లో 40 విజయాలతో కోహ్లీ భారత టెస్ట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్‌గా నిలిచాడు. SENA దేశాల్లో కూడా ఇతర ఆసియా కెప్టెన్ల కంటే మెరుగైన రికార్డును కలిగి ఉన్నాడు. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు అందించిన గొప్ప సేవలను గుర్తు చేసుకుంటూ, బీసీసీఐ సోషల్ మీడియాలో ఒక హృద్యమైన ట్రిబ్యూట్ వీడియోను పోస్ట్ చేసింది. అందులో కోహ్లీ తన కెరీర్‌లో చేసిన అసాధారణ ప్రదర్శనలు, విజయాలు స్పష్టంగా చూపించబడ్డాయి.

Video: విరాట్ కోహ్లీకి ఎమోషనల్ ట్రిబ్యూట్ తెలిపిన BCCI.. చూస్తే కన్నీళ్లు ఆగడం లేదు భయ్యా!
Virat Kohli Bcci

Updated on: May 12, 2025 | 6:20 PM

భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మే 12న తన టెస్ట్ కెరీర్‌కు అధికారికంగా వీడ్కోలు ప్రకటించాడు. కొద్ది రోజుల క్రితమే రోహిత్ శర్మ కూడా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించగా, ఇప్పుడు కోహ్లీ నిర్ణయం భారత క్రికెట్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. సెలక్టర్లు రోహిత్‌ను టెస్ట్ రిటైర్మెంట్‌కి ప్రేరేపించగా, కోహ్లీ మాత్రం కొనసాగాలని కోరారని సమాచారం. అయితే కోహ్లీ తన నిర్ణయాన్ని తుదిగా ప్రకటించడంతో, 2011లో వెస్టిండీస్ టూర్‌తో ప్రారంభమైన ఆయన టెస్ట్ ప్రయాణం ముగిసింది. వెస్టిండీస్ టూర్‌లో టెస్ట్ అరంగేట్రం చేసిన ఆయన, గత 14 ఏళ్లలో భారత్ తరఫున అద్భుత ప్రదర్శనలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

BCCI నుంచి కోహ్లీకి వీడియో రూపంలో ఘనమైన గౌరవం

విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు అందించిన గొప్ప సేవలను గుర్తు చేసుకుంటూ, బీసీసీఐ సోషల్ మీడియాలో ఒక హృద్యమైన ట్రిబ్యూట్ వీడియోను పోస్ట్ చేసింది. అందులో కోహ్లీ తన కెరీర్‌లో చేసిన అసాధారణ ప్రదర్శనలు, విజయాలు స్పష్టంగా చూపించబడ్డాయి.

భారత టెస్ట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా కోహ్లీ

విరాట్ కోహ్లీ భారత టెస్ట్ చరిత్రలో అత్యధిక విజయాలను సాధించిన కెప్టెన్. ఆయన కెప్టెన్సీలో భారత్ 68 టెస్టులు ఆడి, 40 విజయాలు సాధించింది. గెలుపు శాతం 58.82గా ఉంది. అంతేకాకుండా, విదేశీ టెస్టుల్లో కోహ్లీ నాయకత్వ నైపుణ్యం మరింత వెలుగులోకి వచ్చింది. విదేశీ లేదా న్యూట్రల్ వేదికల్లో 37 మ్యాచ్‌ల్లో 16 విజయాలు సాధించి, 43.24% గెలుపు శాతం నమోదు చేశారు. ఇది భారత కెప్టెన్‌గా అత్యధికంగా ఉంది.

SENA దేశాల్లో ఆసియాలోని ఇతరులకన్నా కోహ్లీ ఉత్తమం

SENA (South Africa, England, New Zealand, Australia) దేశాల్లో ఇతర ఆసియా కెప్టెన్లతో పోల్చితే, విరాట్ కోహ్లీ 24 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. 2018/19 టూర్‌లో ఆస్ట్రేలియాపై భారత తొలి టెస్ట్ సిరీస్ విజయం సాధించడం కోహ్లీ కెప్టెన్సీ జీవితంలో అత్యున్నత మైలురాయిగా నిలిచింది. ఇది భారత టెస్ట్ చరిత్రలో ఓ గొప్ప అధ్యాయానికి సంకేతం.

టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ విరాట్‌ కోహ్లీ టెస్ట్‌ రిటైర్మెంట్‌పై స్పందించాడు. “ఏ మ్యాన్‌ విత్‌ లయన్స్‌ ప్యాషన్‌” విల్‌ మిస్‌ యూ చీక్స్‌ అని పేర్కొన్నాడు. కాగా విరాట్‌ కోహ్లీ టెస్ట్‌ ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడం క్రికెట్‌ అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఎవ్వరూ కూడా కోహ్లీ రిటైర్‌ అవ్వాలని కోరుకోలేదు. టెస్ట్‌, వన్డేల్లో విరాట్‌ కోహ్లీ కనీసం మరో మూడేళ్లు అయినా చాలా ఈజీగా ఆడే సత్తా ఉంచుకొని, ఎందుకు రిటైర్‌ అయ్యావంటూ అంతా కోహ్లీని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..