KL Rahul: టీ20ల్లో చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్!
టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ టీ20లో చరిత్ర సృష్టించాడు. తన కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకున్నాడు. టీ20 వేగంగా 8వేల పరుగులు పూర్తి చేసిన భారత అటగాడిగా కేఎల్ రాహుల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అయితే ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్న ఈ రికార్డును కేఎల్ రాహుల్ బ్రేక్ చేశాడు. ఆదివారం ఐపీఎల్‌లో 2025లో భాగంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను కేఎల్ రాహుల్ అందుకున్నారు.

టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ టీ20లో చరిత్ర సృష్టించాడు. తన కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకున్నాడు. టీ20 వేగంగా 8వేల పరుగులు పూర్తి చేసిన భారత అటగాడిగా కేఎల్ రాహుల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అయితే ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్న ఈ రికార్డును కేఎల్ రాహుల్ బ్రేక్ చేశాడు. అయితే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 243 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగుల చేసి గతంలో రికార్డ్ నెలకొల్పగా.. తాజాగా రాహుల్ 224 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగులు చేసి టీ20లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన భారత ప్లేయర్ కేఎల్ రాహుల్ హిస్ట్రీ క్రియేట్ చేశాడు.
అయితే ఇప్పటి వరకు టీ20 క్రికెట్‌లో వేగంగా 8 వేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితా చూసుకుంటే అందులో వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్ గేల్ టాప్‌లో కొనసాగుతున్నాడు. గేల్ 213 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ను సాధించగా.. పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజామ్ 218 ఇన్నింగ్స్‌లో 8 వేల పరుగులను పూర్తి చేసి రెండో ప్లేస్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక వారి తర్వాత తాజాగా 224 ఇన్నింగ్స్‌లలో 8 వేల పరుగులు పూర్తి చేసి కేఎల్ రాహుల్ 3వ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.
🚨 HISTORY-MAKER KL RAHUL! 🚨🔹Fastest Indian to 8000 T20 runs – in just 224 innings!🔹Breaks Virat Kohli’s record (243 inns)!🔹3rd fastest overall after Gayle (213) & Babar (218)!🔹First Indian to do it in under 230 innings!– What a milestone in #IPL2025!#KLRahul #DCvGT pic.twitter.com/LcGk8smgLj
— Yogesh Goswami (@yogeshgoswami_) May 18, 2025
అయితే ఆదివారం ఐపీఎల్‌లో 2025లో భాగంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను కేఎల్ రాహుల్ అందుకున్నారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించాడు. సెంచరీతో చెలరేగాడు. అయితే ఈ సీజన్‌లో కేఎల్ రాహుల్ ఢిల్లీకి తరపున ఆడుతుండగా.. ఆ జట్టు ఇప్పుడు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..