KKR vs SRH Playing 11 IPL 2022: కేకేఆర్‌తో పోరుకు సిద్ధమైన హైదరాబాద్.. ప్లేయింగ్ XIలో కీలక మార్పులు..

|

Apr 15, 2022 | 10:50 AM

ఐపీఎల్ 15లో శుక్రవారం SRHతో KKR తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. అయితే, గత మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా..

KKR vs SRH Playing 11 IPL 2022: కేకేఆర్‌తో పోరుకు సిద్ధమైన హైదరాబాద్.. ప్లేయింగ్ XIలో కీలక మార్పులు..
Kkr Vs Srh Playing Xi
Follow us on

ఐపీఎల్ 15(IPL 2022)లో 25 వ మ్యాచ్‌లో భాగంగా శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం కోల్‌కతా నైట్ రైడర్స్‌(KKR vs SRH)తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీతో జరిగిన ఓటమిని మరిచిపోయి మరోసారి శుభారంభం చేసే అవకాశం కేకేఆర్‌కు దక్కనుంది. అదే సమయంలో, హైదరాబాద్ జట్టు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోయేందుకు ఇష్టపడదు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన హైదరాబాద్‌.. ముచ్చటగా మరో విజయం కోసం బరిలోకి దిగనుంది. కాబట్టి నేటి మ్యాచ్‌లో కోల్‌కతా, హైదరాబాద్‌లు ఏ ఆటగాళ్లతో మైదానంలోకి దిగవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

కోల్‌కతాలో మార్పులు..

కోల్‌కతాకు అతిపెద్ద సమస్య అజింక్యా రహానే ఫామ్. రహానే వరుసగా ఫ్లాప్‌ అవుతున్నాడు. ఇటువంటి పరిస్థితిలో, జట్టు అతనికి బదులుగా ఫించ్‌ను జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే సామ్ బిల్లింగ్స్ బయట కూర్చొనే ఛాన్స్ ఉంది.

కోల్‌కతా ప్రాబబుల్ ప్లేయింగ్ XI: వెంకటేష్ అయ్యర్, ఆరోన్ ఫించ్, శ్రేయాస్ అయ్యర్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, షెల్డన్ జాక్సన్, రసిఖ్ సలామ్, పాట్ కమిన్స్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

హైదరాబాద్‌లో కూడా పలు మార్పులు..

ఈ మ్యాచ్‌కు ముందు హైదరాబాద్‌కు బ్యాడ్ న్యూస్ వచ్చింది. స్టార్ ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతని స్థానంలో శ్రేయాస్‌ గోపాల్‌కి అవకాశం దక్కవచ్చు.

హైదరాబాద్‌కు ప్రాబబుల్ ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్.

పిచ్ ఎలా ఉందంటే..

ఈ మ్యాచ్ బ్రబౌర్న్ స్టేడియంలో జరగనుంది. ఈ మైదానం బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ 177 పరుగులే అత్యల్ప స్కోరు. ఇది కాకుండా లైట్‌లో లక్ష్యాన్ని ఛేదించడం సులభం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టాస్ గెలిచిన తర్వాత జట్టు బౌలింగ్ చేయాలనుకుంటుంది.

బలంగానే కోల్‌కతా..

కోల్‌కతా తన చివరి మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ, ఇప్పటికీ జట్టు మంచి స్థితిలోనే ఉంది. హైదరాబాద్ మాత్రం ఇంకా కష్టాల్లోనే కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితిలో KKR గెలిచి మళ్లీ ట్రాక్‌లోకి రావాలని కోరుకుంటుంది.

Also Read: IPL 2022: హార్దిక్ పాండ్యాకు లక్ష రూపాయల నష్టం.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..!

Watch Video: ప్లీజ్.. మీ కాళ్లు మొక్కనివ్వండన్న జాంటీ రోడ్స్.. వద్దని వారించిన సచిన్.. వైరల్ వీడియో