KKR vs SRH Live Score: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పై సన్‌రైజర్స్‌ ఘన విజయం

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad IPL 2023 Live Score in Telugu: టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ప్రస్తుత సీజన్‌లో ఇదే అతిపెద్ద స్కోరు.

KKR vs SRH Live Score: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పై సన్‌రైజర్స్‌ ఘన విజయం
Kkr Vs Srh Live Score

Edited By: Rajeev Rayala

Updated on: Apr 15, 2023 | 2:23 AM

KKR vs SRH Live Score: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 16వ సీజన్‌లో 19వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం కోల్‌కతా నైట్ రైడర్స్‌కు 229 పరుగుల లక్ష్యాన్ని అందించింది. హ్యారీ బ్రూక్ బ్యాట్‌తో సీజన్‌లో మొదటి సెంచరీ పూర్తి చేశాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ప్రస్తుత సీజన్‌లో ఇదే అతిపెద్ద స్కోరు.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో హైదరాబాద్ తరపున హ్యారీ బ్రూక్ ప్రస్తుత సీజన్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. అతను 55 బంతుల్లో 100 పరుగులు చేశాడు. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (50 పరుగులు) నాలుగో అర్ధ సెంచరీ సాధించాడు.

ఐపీఎల్ 2023 19వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతుంది. నితీష్ రాణా సారథ్యాంలోని కేకేఆర్ టీం ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది. అయితే ఈ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. 3 మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌ కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. హైదరాబాద్ 2 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై చివరి ఓవర్‌లో వరుసగా 5 సిక్సర్లు బాది కేకేఆర్‌కు విజయాన్ని అందించిన కేకేఆర్‌కు చెందిన రింకూ సింగ్‌పైనే అందరి దృష్టి ఉంటుంది.

ఇరు జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(సి), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్(w), మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్.

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), N జగదీసన్, నితీష్ రాణా(c), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, సుయాష్ శర్మ, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 14 Apr 2023 11:19 PM (IST)

    సన్‌రైజర్స్‌ ఘన విజయం

    కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పై సన్‌రైజర్స్‌ ఘన విజయం సాధించింది. కోల్‌కతాపై హైదరాబాద్‌ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.

  • 14 Apr 2023 11:15 PM (IST)

    ఏడో వికెట్‌ను కోల్పోయిన కేకేఆర్

    197 పరుగుల వద్ద కోల్‌కతా ఏడో వికెట్‌ను కోల్పోయింది.


  • 14 Apr 2023 10:59 PM (IST)

    ఆరో వికెట్‌ను కోల్పోయిన కోల్‌కతా

    165 పరుగుల వద్ద కోల్‌కతా ఆరో వికెట్‌ను కోల్పోయింది. నితీశ్‌ రాణా (75) అవుట్

  • 14 Apr 2023 10:28 PM (IST)

    మరో వికెట్ కోల్పోయిన కేకేఆర్

    ఆండ్రూ రస్సెల్‌ (3) అవుట్ అయ్యాడు. మయాంక్‌ మార్కండే బౌలింగ్‌లో  భారీ షాట్‌కు ప్రయత్నించి రస్సెల్ అవుట్ అయ్యాడు

  • 14 Apr 2023 10:19 PM (IST)

    4 వికెట్లు కోల్పోయిన  కోల్‌కతా

    కోల్‌కతా 9 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది.

  • 14 Apr 2023 09:50 PM (IST)

    మూడు వికెట్లు డౌన్..

    కోల్‌కతా 4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసింది. ఎన్ జగదీషన్ క్రీజులో ఉన్నాడు. సునీల్ నరైన్ సున్నాకే ఔటయ్యాడు. యాన్సెన్‌కు ఇది రెండో వికెట్. వెంకటేష్ (10 పరుగులు)ను అవుట్ చేశాడు. వికెట్ కీపర్ రహ్మానుల్లా గుర్బాజ్ సున్నా వద్ద ఔటయ్యాడు.

  • 14 Apr 2023 09:24 PM (IST)

    కోల్‌కతా ముందు 229 పరుగుల టార్గెట్

    ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 16వ సీజన్‌లో 19వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం కోల్‌కతా నైట్ రైడర్స్‌కు 229 పరుగుల లక్ష్యాన్ని అందించింది. హ్యారీ బ్రూక్ బ్యాట్‌తో సీజన్‌లో మొదటి సెంచరీ పూర్తి చేశాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ప్రస్తుత సీజన్‌లో ఇదే అతిపెద్ద స్కోరు.

    కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో హైదరాబాద్ తరపున హ్యారీ బ్రూక్ ప్రస్తుత సీజన్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. అతను 55 బంతుల్లో 100 పరుగులు చేశాడు. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (50 పరుగులు) నాలుగో అర్ధ సెంచరీ సాధించాడు.

  • 14 Apr 2023 09:11 PM (IST)

    హ్యారీ బ్రూక్ తొలి సెంచరీ..

    హైదరాబాద్ 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లకు 220 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్, హెన్రీ క్లాసెన్ క్రీజులో ఉన్నారు. బ్రూక్ ఐపీఎల్ కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు.

  • 14 Apr 2023 08:54 PM (IST)

    17 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్..

    హైదరాబాద్ 17 ఓవర్లలో మూడు వికెట్లకు 186 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్, అభిషేక్ శర్మ క్రీజులో ఉన్నారు. వీరిద్దరి మధ్య అర్ధ సెంచరీ భాగస్వామ్యం ఉంది. బ్రూక్ ఐపీఎల్ కెరీర్‌లో తొలి అర్ధ సెంచరీ సాధించాడు.

  • 14 Apr 2023 08:47 PM (IST)

    బ్రూక్ హాఫ్ సెంచరీ..

    హైదరాబాద్ 14 ఓవర్లలో మూడు వికెట్లకు 134 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్, అభిషేక్ శర్మ క్రీజులో ఉన్నారు. బ్రూక్ తన ఐపీఎల్ కెరీర్‌లో తొలి అర్ధ సెంచరీ సాధించాడు.

  • 14 Apr 2023 08:33 PM (IST)

    13 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్..

    13 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ టీం 3 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ 53, అభిషేక్ శర్మ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

  • 14 Apr 2023 08:16 PM (IST)

    9 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్..

    9 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ టీం 2 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ 45, మర్క్రాం 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 14 Apr 2023 08:04 PM (IST)

    రెండు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్

    హైదరాబాద్ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. మయాంక్ అగర్వాల్(9), రాహుల్ త్రిపాఠి(9) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. అలాగే 6 ఓవర్లు ముగిసేసరికి SRH 65/2 పరుగులు చేసింది.

  • 14 Apr 2023 07:49 PM (IST)

    బ్రూక్ దూకుడు

    హ్యారీ బ్రూక్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. వరుస బౌండరీలు బాదేస్తూ.. స్కోర్‌బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. దీంతో SRH 4 ఓవర్లలో 46 పరుగులు చేసింది.

  • 14 Apr 2023 07:36 PM (IST)

    బ్రూక్ 3 ఫోర్లు..

    టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టుకు హ్యారీ బ్రూక్ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. మొదటి ఓవర్‌లో 3 ఫోర్లు కొట్టగా.. ఎస్‌ఆర్‌హెచ్ ఓవర్ ముగిసే సమయానికి 14 పరుగులు చేసింది.

  • 14 Apr 2023 07:11 PM (IST)

    ఇరు జట్లు:

    సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(సి), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్(w), మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్

    కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), N జగదీసన్, నితీష్ రాణా(c), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, సుయాష్ శర్మ, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చకరవర్తి

  • 14 Apr 2023 07:02 PM (IST)

    KKR vs SRH Live Score: టాస్ గెలిచిన కోల్‌కతా..

    టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ టీం తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మొదట బ్యాటింగ్ చేయనుంది.

  • 14 Apr 2023 06:37 PM (IST)

    KKR vs SRH Live Score: కోల్‌కతా వర్సెస్ హైదరాబాద్ మధ్య పోరు..

    ఐపీఎల్ 2023 19వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో వరుసగా 5 సిక్సర్లు కొట్టి గుజరాత్ టైటాన్స్ నుంచి విజయాన్ని కైవసం చేసుకున్న KKR రింకూ సింగ్‌పై కన్నేసింది.