ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య మ్యాచ్ జరుగుతోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో చెన్నై ఈ సీజన్‌లో అతిపెద్ద స్కోరు సాధించింది. అజింక్య రహానే, డెవాన్ కాన్వే, శివమ్ దూబే అర్ధశతకంతో ఆ జట్టు 4 వికెట్లకు 235 పరుగులు చేసింది.
చెన్నై కంటే ముందు ఏప్రిల్ 14న కోల్‌కతాపై సన్‌రైజర్స్ హైదరాబాద్ 228 పరుగులు చేసింది. కోల్‌కతాకు చెందిన కుల్వంత్ ఖేజ్రోలియా అత్యధికంగా 2 వికెట్లు పడగొట్టాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్ నాలుగుసార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో తలపడనుంది. కోల్‌కతా తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమిని చవిచూడగా, చెన్నై తమ చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. కోల్‌కతా ఈ మ్యాచ్‌తో విజయపథంలోకి రావాలని కోరుకుంటుండగా, చెన్నై తన విజయ పరంపరను కొనసాగించాలనుకుంటోంది.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, MS ధోని(కీపర్/కెప్టెన్), మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): ఎన్ జగదీసన్(కీపర్), జాసన్ రాయ్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, డేవిడ్ వైస్, కుల్వంత్ ఖేజ్రోలియా, సుయాష్ శర్మ, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: ఆకాష్ సింగ్, డ్వైన్ ప్రిటోరియస్, సుభ్రాంశు సేనాపతి, షేక్ రషీద్, ఆర్‌ఎస్ హంగర్గేకర్.
కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: మన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, లిట్టన్ దాస్, వెంకటేష్ అయ్యర్.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై టీం నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా ముందు 236 పరుగుల భారీ స్కోర్ నిలిచింది.
18 ఓవర్లు ముగిసేసరికి చెన్నై జట్టు 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.
14 ఓవర్లు ముగిసేసరికి చెన్నై జట్టు 2 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.
11 ఓవర్లు ముగిసే సరికి చెన్నై టీం ఒక వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. డేవాన్ కాన్వే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
3 ఓవర్లు ముగిసేసరికి చెన్నై టీం వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది.
చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: ఆకాష్ సింగ్, డ్వైన్ ప్రిటోరియస్, సుభ్రాంశు సేనాపతి, షేక్ రషీద్, ఆర్‌ఎస్ హంగర్గేకర్.
కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: మన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, లిట్టన్ దాస్, వెంకటేష్ అయ్యర్.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, MS ధోని(కీపర్/కెప్టెన్), మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): ఎన్ జగదీసన్(కీపర్), జాసన్ రాయ్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, డేవిడ్ వైస్, కుల్వంత్ ఖేజ్రోలియా, సుయాష్ శర్మ, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
టాస్ గెలిచిన కోల్‌కతా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై టీం ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ తమ సొంత మైదానానికి తిరిగి వచ్చింది. ఇక్కడ నాలుగు సార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడేందుకు సిద్ధమైంది. చెన్నై అద్భుతమైన ఫామ్‌లో ఉంది. అందువల్ల కోల్‌కతా గెలవడం అంత సులభం కాదు.