Venkatesh Iyer: కేకేఆర్ రిటైన్ చేసుకోకపోవడంపై వెంకటేశ్ అయ్యార్ ఎమోషనల్.. ఏమన్నాడంటే?

కేకేఆర్ రిటెన్షన్ లిస్ట్‌లో తన పేరు లేకపోవడంపై టీమ్ ఇండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యారు ఎమోషనల్ అయ్యారు. రిటెన్షన్ లిస్టు చూసిన తర్వాత కన్నీళ్లు వచ్చినట్లు వెంకటేశ్ అయ్యార్ తెలిపాడు. తనను ఎందుకు రిటైన్ చేసుకోలేదో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.

Venkatesh Iyer: కేకేఆర్ రిటైన్ చేసుకోకపోవడంపై వెంకటేశ్ అయ్యార్ ఎమోషనల్.. ఏమన్నాడంటే?
Venkatesh Iyer

Updated on: Nov 03, 2024 | 11:59 AM

తనను కేకేఆర్‌ రిటైన్ చేసుకోకపోవడంపై టీమిండియా యంగ్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్‌ ఆవేదన వ్యక్తం చేశాci. అయితే కేకేఆర్ ఫ్రాంచైజీ తనను వేలంలో తిరిగి కొనుగోలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 2025 మెగా వేలం కోసం ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్‌ను అన్ని జట్లు గత నెల అక్టోబర్ 31న విడుదల చేశాయి. కేకేఆర్ ఈసారి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌, మిచెల్ స్టార్క్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్ వంటి కీలక ప్లేయర్‌లను వేలంలోకి విడిచిపెట్టింది. గత నాలుగు IPL సీజన్‌లలో KKR కోసం వెంకటేష్ శ్రమించాడు. 2021లో జట్టు ఫైనల్‌కు చేరుకోవడంలో, 2024లో టైటిల్‌ను కైవసం చేసుకోవడంలో వెంకటేష్ పాత్ర కూడా ఉంది.  వెంకటేష్ IPL 2024 సీజన్‌లో నాలుగు అర్ధ సెంచరీలు చేశాడు. 158.80 స్ట్రైక్ రేట్‌తో 370 పరుగులు చేశాడు. రిటైన్ చేసుకోకపోయిన కానీ  వేలంలో తనను కేకేఆర్ తీసుకుంటుందని వెంకటేష్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

KKR రిటైన్ చేసిన ఆటగాళ్లు

రింకూ సింగ్

వరుణ్ చక్రవర్తి

సునీల్ నరైన్

ఆండ్రీ రసెల్

హర్షిత్ రాణా

రమణదీప్ సింగ్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి