IPL 2023: ‘జీరో నెం.1’.. డకౌట్ల విషయంలో చెత్త రికార్డు మూటగట్టుకున్నకేకేఆర్‌ బ్యాటర్‌.. టాప్- 5 లిస్టు ఇదే

|

Apr 07, 2023 | 9:39 AM

కోల్‌కతా జట్టులో ఓపెనర్‌ రహమానుల్లా గుర్బాజ్ (44 బంతుల్లో 57 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) , శార్దూల్ ఠాకూర్‌ (29 బంతుల్లోనే 68 రన్స్‌ 9 ఫోర్లు, 3 సిక్సులు) అర్ధసెంచరీలతో రాణించారు. అయితే ఇదే మ్యాచ్‌లో కేకేఆర్‌ బ్యాటర్‌ మన్ దీప్ సింగ్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. వన్ డౌన్ లో వచ్చిన మన్ దీప్ సింగ్.. డేవిడ్ విల్లీ బౌలింగ్‌లో..

IPL 2023: జీరో నెం.1.. డకౌట్ల విషయంలో చెత్త రికార్డు మూటగట్టుకున్నకేకేఆర్‌ బ్యాటర్‌.. టాప్- 5 లిస్టు ఇదే
Mandeep Singh
Follow us on

ఐపీఎల్ 2023 ఆసక్తికరంగా సాగుతోంది. భారీస్కోర్లు నమోదు కావడం, మ్యాచులు ఉత్కంఠభరితంగా జరుగుతుండడంతో క్రికెట్‌ ఫ్యాన్స్ ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే గురువారం (ఏప్రిల్‌ 6) ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానం వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ ఏకపక్షంగా సాగింది. మొదట కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 204 పరుగులు చేయగా.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 123 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఈ సీజన్‌లో అతి పెద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక కోల్‌కతా జట్టులో ఓపెనర్‌ రహమానుల్లా గుర్బాజ్ (44 బంతుల్లో 57 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) , శార్దూల్ ఠాకూర్‌ (29 బంతుల్లోనే 68 రన్స్‌ 9 ఫోర్లు, 3 సిక్సులు) అర్ధసెంచరీలతో రాణించారు. అయితే ఇదే మ్యాచ్‌లో కేకేఆర్‌ బ్యాటర్‌ మన్ దీప్ సింగ్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. వన్ డౌన్ లో వచ్చిన మన్ దీప్ సింగ్.. డేవిడ్ విల్లీ బౌలింగ్‌లో మొదటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తద్వారాఐపీఎల్‌ టోర్నీలో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాడిగా చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడీ యంగ్‌ ప్లేయర్‌. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 15సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు మణ్‌దీప్‌. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్ ల చెత్త రికార్డును కూడా బద్దలు కొట్టాడు. రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో 223 మ్యాచుల్లో 14 సార్లు డకౌట్ అయ్యాడు. అదే సమయంలో దినేష్ కార్తీక్ 209 మ్యాచుల్లో 14 సార్లు పరుగులేమీ చేయకుండా వెనుదిరిగాడు. ఇక మన్ దీప్ సింగ్ కేవలం 97 ఇన్నింగ్స్ ల్లో 15 సార్లు డకౌట్ అయ్యాడు. తద్వారా రోహిత్ శర్మ, దినేష్ కార్తీ్క్ ల చెత్త రికార్డును బ్రేక్ చేశాడు.

ఈ విషయంలో టాప్‌-10లో లిస్టులో 8 మంది భారత ఆటగాళ్లే ఉండడం గమనార్హం. పీయూష్ చావ్లా, హర్భజన్ సింగ్, పార్థివ్ పటేల్, అజింక్య రహానే, అంబటి రాయుడు, దినేష్ కార్తీక్ లాంటి స్టార్ ప్లేయర్స్ ఈ లిస్టులో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో విజయం సాధించిన కోల్‌కతా ఈ సీజన్‌లో మొదటి విజయాన్ని అందుకుంది. 205 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టుకు కోల్‌కతా స్పిన్నర్లు చుక్కలు చూపించారు. వరుణ్‌ చక్రవర్తి (15/4), సుయాశ్‌ శర్మ (30/3), సునీల్‌ నరైన్‌ (16/2) బెంగళూరు బ్యాటర్లను క్రీజుల్లో కుదరనీయలేదు. విరాట్‌ కోహ్లీ (21), డుప్లెసిస్‌ (23), డేవిడ్‌ విల్లీ (20), బ్రేస్‌వెల్‌ (19) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతా బ్యాటర్లందరూ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఒకానొక దశలో ఆర్సీబీ 96 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. అయితే డేవిడ్ విల్లీ, ఆకాశ్ దీప్ చివరి వికెట్ కు 27 పరుగులు జోడించడంతో చివరకు 123 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..