IPL 2022: పెళ్లిపీటలెక్కిన మరో స్టార్‌ క్రికెటర్‌.. ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాక ప్రేయసితో కలిసి..

Tim Southee: మరికొన్ని రోజుల్లో ధనాధన్‌ ఐపీఎల్‌ (IPL2022) టోర్నీ ప్రారంభకానుంది. దీంతో క్రికెటర్లు వివాహం చేసుకుని ఈ మెగా క్రికెట్‌ లీగ్‌లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారు.

IPL 2022: పెళ్లిపీటలెక్కిన మరో స్టార్‌ క్రికెటర్‌.. ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాక ప్రేయసితో కలిసి..
Tim Southee

Updated on: Mar 21, 2022 | 7:20 AM

Tim Southee: మరికొన్ని రోజుల్లో ధనాధన్‌ ఐపీఎల్‌ (IPL2022) టోర్నీ ప్రారంభకానుంది. దీంతో క్రికెటర్లు వివాహం చేసుకుని ఈ మెగా క్రికెట్‌ లీగ్‌లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌, ఆర్సీబీ (RCB) ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ తన ప్రియురాలు వినీరామన్‌తో కలిసి పెళ్లిపీటలెక్కగా.. తాజాగా న్యూజిలాండ్‌ స్టార్‌ క్రికెటర్‌, కేకేఆర్‌ ఆల్‌రౌండర్‌టిమ్ సౌథీ (Tim Southee) వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ప్రేయసి బ్రయా ఫహీనితో కలిసి జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. వివాహ వేడుక అనంతరం తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు సౌథీ. దీంతో పలువురు క్రికెటర్లు, అభిమానులు నూతన దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు.

పెళ్లికి ముందే..

సౌథీ-బ్రయా చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. సహజీవనం కూడా చేస్తున్నారు. తమ ప్రేమకు గుర్తుగా వీరికి ఇండీ మే సౌథీ, స్లోయానే అవా సౌథీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా న్యూజిలాండ్ జట్టులో కీలక ఆటగాడిగా పేరున్న సౌథీ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల తరఫున ఆడాడు. ఇక ఐపీఎల్ 2022 సీజన్‌ మెగా వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రూ.1.5 కోట్లకు ఈ స్టార్‌ క్రికెటర్‌ను కొనుగోలు చేసింది. ఇక ఐపీఎల్‌ ప్రారంభమ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నైను ఢీకొట్టనుంది. మార్చి26న ముంబై వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది.

Also Read:Bhagavad Gita: పాఠశాలల్లో భగవద్గీత బోధించే ఆలోచన.. సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి

Child Care: పిల్లలకు ఈ ఫుడ్ తినిపిస్తే అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.. అవేంటంటే..!

Health Tips: వెనుక జేబులో పర్స్ పెట్టుకుంటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే