Video: రిటైర్మెంట్ ఏజ్‌లో రప్పా, రప్పా.. 3 సిక్సర్లు, 4 ఫోర్లతో మ్యాచ్ రిజల్ట్‌నే మార్చిన రోహిత్ ఓల్డ్ ఫ్రెండ్

MI New York Enter Finals vs Texas Super Kings Qualifier 2: వెస్టిండీస్ అనుభవజ్ఞుడైన ఆటగాడు కీరన్ పొలార్డ్ అద్భుతమైన ఆటతో తన జట్టును టైటిల్ మ్యాచ్‌కు తీసుకెళ్లాడు. పొలార్డ్ కాకుండా, మరో వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ కూడా క్వాలిఫయర్-2లో అద్భుతమైన ఆటతో ఆకట్టుకున్నాడు.

Video: రిటైర్మెంట్ ఏజ్‌లో రప్పా, రప్పా.. 3 సిక్సర్లు, 4 ఫోర్లతో మ్యాచ్ రిజల్ట్‌నే మార్చిన రోహిత్ ఓల్డ్ ఫ్రెండ్
Kieron Pollard Mlc 2025

Updated on: Jul 12, 2025 | 1:20 PM

MI New York Enter Finals vs Texas Super Kings Qualifier 2: మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2025లో ఉత్కంఠభరితమైన క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో కీరన్ పొలార్డ్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఎంఐ న్యూయార్క్ జట్టు టెక్సాస్ సూపర్ కింగ్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి ప్రవేశించింది. జులై 11, శుక్రవారం నాడు గ్రాండ్ ప్రైరీ స్టేడియం, డల్లాస్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో, పోలార్డ్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.

ముందుగా బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (59), అకీల్ హొస్సేన్ (55 నాటౌట్) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో జట్టుకు మంచి స్కోరు అందించారు. ఎంఐ న్యూయార్క్ బౌలర్లలో ట్రిస్టన్ లూస్ 3 వికెట్లు పడగొట్టగా, రుషిల్ ఉగార్కర్ 2 వికెట్లు తీశారు.

167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంఐ న్యూయార్క్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ క్వింటన్ డి కాక్ త్వరగానే వెనుదిరిగాడు. మోనాంక్ పటేల్ (49) చక్కటి ఇన్నింగ్స్ ఆడినా, అసలు ఆట అప్పుడే మొదలైంది. కెప్టెన్ నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్ క్రీజులోకి వచ్చిన తర్వాత మ్యాచ్ స్వరూపం మారిపోయింది.

పొలార్డ్, తనదైన శైలిలో సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 22 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్లతో అజేయంగా 47 పరుగులు చేసి, మ్యాచ్‌ను ఎంఐ న్యూయార్క్ వైపు తిప్పేశాడు. అతనికి నికోలస్ పూరన్ (52 నాటౌట్) అండగా నిలిచి, కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. వీరిద్దరి భాగస్వామ్యం టెక్సాస్ బౌలర్లను నిస్సహాయులను చేసింది. ఇంకా 6 బంతులు మిగిలి ఉండగానే ఎంఐ న్యూయార్క్ లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ అద్భుతమైన ప్రదర్శనతో కైరన్ పొలార్డ్‌కు “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు లభించింది. లీగ్ దశలో తడబడిన ఎంఐ న్యూయార్క్, ప్లేఆఫ్స్‌లో అద్భుతంగా పుంజుకుని, వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరగనున్న ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో ఎంఐ న్యూయార్క్ తలపడనుంది. ఈ విజయం ఎంఐ న్యూయార్క్ అభిమానులకు పండగ వాతావరణం తీసుకొచ్చింది.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..