
Kagiso Rabada vs Suryakumar Yadav: కగిసో రబడా ఈ ఐపీఎల్ సీజన్‌లో మాత్రం సరికొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అతడిని పవర్‌ప్లేలో ఎంతో చాకచక్యంగా వాడుకుంటున్నాడు. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రబడా తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనలలో ఒకటి నమోదు చేశాడు. పిచ్‌పై ఉన్న తేమను, వేగాన్ని అందిపుచ్చుకుని ఆరంభం నుంచే ముంబై బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.
ఈ మ్యాచ్‌లో రబడా వేసిన ఓ డెలివరీని విశ్లేషకులు ‘బాల్ ఆఫ్ ది టోర్నమెంట్’గా అభివర్ణిస్తున్నారు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి తడబడుతున్న సూర్యకుమార్ యాదవ్‌ను రబడా తన వేగంతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఒక దశలో సూర్య కొన్ని భారీ షాట్లు కొట్టినప్పటికీ, రబడా అద్భుతంగా పుంజుకున్నాడు. 152 కిలోమీటర్ల వేగంతో ఆఫ్ స్టంప్ దిశగా పడిన లెంగ్త్ బంతి, ఒక్కసారిగా లోపలికి దూసుకువచ్చింది.
Quinton de Kock ✅
Surya Kumar Yadav ✅Kagiso Rabada with a fine piece of new-ball bowling 👌
Updates ▶️ https://t.co/cawFoZABvQ#TATAIPL | #KhelBindaas | #GTvMI | @gujarat_titans pic.twitter.com/Xw2QlE4kZF
— IndianPremierLeague (@IPL) April 20, 2026
సూర్యకుమార్ బ్యాట్, ప్యాడ్ మధ్య ఉన్న ఖాళీని చీల్చుకుంటూ వెళ్లిన ఆ బంతి, వికెట్లను అత్యంత వేగంగా తాకింది. ఆ తాకిడికి ఆఫ్ స్టంప్, లెగ్ స్టంప్ రెండు కూడా నేల నుంచి అల్లంత దూరాన ఎగిరి పడ్డాయి. ఈ అద్భుతమైన బంతికి సమాధానం లేక సూర్య నిశ్చేష్టుడై వెనుదిరిగాడు.
కేవలం సూర్యకుమార్ మాత్రమే కాకుండా, క్వింటన్ డికాక్, అరంగేట్రం చేసిన డానిష్ మలేవార్ వికెట్లను కూడా రబడా తన ఖాతాలో వేసుకున్నాడు. పవర్‌ప్లేలో అతడు విసిరిన నిప్పులు చెరిగే బంతులు ముంబై ఇండియన్స్ వెన్నుముకను విరిచాయి. సూర్య వంటి అగ్రశ్రేణి బ్యాటర్‌ను అంతటి వేగంతో క్లీన్ బౌల్డ్ చేయడం రబడాలో ఉన్న పాత ఆధిపత్యాన్ని గుర్తుచేసింది. ఈ ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్ జట్టులో రబడా అత్యంత కీలకమైన బౌలర్‌గా మరోసారి నిరూపించుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..