
India vs England, 1st Test: హైదరాబాద్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతోంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో టాస్ గెలిచిన ఇంగ్లీష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లు తలో ముగ్గురు స్పిన్నర్లతో ఆడేందుకు వచ్చాయి. కాగా, మొదటి రోజు మొదటి సెషన్ ముగిసే సరికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. జానీ బెయిర్‌స్టో, జో రూట్ నాటౌట్‌గా నిలిచారు. వీరిద్దరి మధ్య 48 పరుగుల భాగస్వామ్యం ఉంది.
ఈ క్రమంలో జోరూట్ తన అనుభవంతో ఉప్పల్ మైదానంలో భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో జో రూట్ అజేయంగా 18 (35) పరుగులతో నిలిచాడు. మొదటి మ్యాచ్ ప్రారంభానికి ముందు, సచిన్ 32 టెస్టుల్లో 2535 పరుగులతో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
అయితే, మాస్టర్ బ్లాస్టర్ ఫీట్‌ను అధిగమించడానికి రూట్‌కు కేవలం పది పరుగులు మాత్రమే అవసరం కాగా, ప్రస్తుతం జో రూట్ అజేయంగా 18 పరుగులతో నిలిచాడు. ఈ క్రమంలో రూట్ ఇప్పుడు కేవలం 45 ఇన్నింగ్స్‌లలో 2544 పరుగులతో సచిన్ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. 21వ ఓవర్ నాలుగో బంతికి అక్షర్ పటేల్ బౌండరీ బాదిన రూట్ ఈ మైలురాయిని అందుకున్నాడు.
జో రూట్ – 2544
సచిన్ టెండూల్కర్- 2535
సునీల్ గవాస్కర్ – 2483
అలైస్టర్ కుక్ – 2431
విరాట్ కోహ్లీ – 1991
రాహుల్ ద్రవిడ్ – 1950.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
That’s Lunch on Day 1 of the first #INDvENG Test! #TeamIndia scalp 3⃣ England wickets in the First Session!
2⃣ wickets for @ashwinravi99
1⃣ wicket for @imjadejaStay Tuned for Second Session ⌛️
Scorecard ▶️ https://t.co/HGTxXf8b1E@IDFCFIRSTBank pic.twitter.com/5MYLO4LwXs
— BCCI (@BCCI) January 25, 2024
ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..