Zim Afro T10: మరి కాసేపట్లోనే జిమ్ ఆఫ్రో టీ10 ఫైనల్.. తొలి టైటిల్ కోసం బరిలోకి డర్బన్ కాలెండర్స్, జోబర్గ్ బఫెలోస్..

|

Jul 29, 2023 | 7:11 PM

Zim Afro T10 2023: ఎలిమినేటర్ మ్యాచ్‌లో హరారే హరికేన్స్ 9 వికెట్ల తేడాతో కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ జట్టును ఓడించి రెండో క్వాలిఫైయర్‌కు అర్హత సాధించింది. అలా రెండో క్వాలిఫయర్‌‌కి ప్రవేశించిన హరారే హరికేన్స్ జట్టును తొలి క్వాలిఫైయర్స్‌లో ఓడిన డర్బన్ కాలండర్స్.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్స్‌కి చేరింది. అలా తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో తలపడిన డర్బన్ కాలందర్స్, జోబర్గ్ బఫెలోస్ జట్లే ఫైనల్ మ్యాచ్‌లోనూ..

Zim Afro T10: మరి కాసేపట్లోనే జిమ్ ఆఫ్రో టీ10 ఫైనల్.. తొలి టైటిల్ కోసం బరిలోకి డర్బన్ కాలెండర్స్, జోబర్గ్ బఫెలోస్..
Zim Afro T10 2023 Final
Follow us on

Zim Afro T10 2023: జింబాబ్వేలో జరుగుతోన్న జిమ్ ఆఫ్రో T10 లీగ్‌ ఫైనల్‌ చివరి మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. భారత కాలమాన ప్రకారం శనివారం రాత్రి 8:30 గంటలకు అంటే మరికాసేపట్లో ప్రారంభమయ్యే ఫైనల్ మ్యాచ్‌లో జోబర్గ్ బఫెలోస్, డర్బన్ కాలండర్స్ తలపడనున్నాయి. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరగనుంది. మొత్తం 5 జట్ల మధ్య జరిగిన ఈ టోర్నీలో 4 జట్లు ప్లే ఆఫ్స్‌కి చేరగా.. జోబర్గ్, డర్బన్ జట్లు టైటిల్ మ్యాచ్‌కి చేరాయి. మొదటి క్వాలిఫయర్‌లో జోబర్గ్ బఫెలోస్ 6 వికెట్ల తేడాతో డర్బన్ కాలండర్స్ జట్టును ఓడించి నేరుగా జిమ్ ఆఫ్రో T10 లీగ్‌ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది.

ఆ తర్వాత జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో హరారే హరికేన్స్ 9 వికెట్ల తేడాతో కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ జట్టును ఓడించి రెండో క్వాలిఫైయర్‌కు అర్హత సాధించింది. అలా రెండో క్వాలిఫయర్‌‌కి ప్రవేశించిన హరారే హరికేన్స్ జట్టును తొలి క్వాలిఫైయర్స్‌లో ఓడిన డర్బన్ కాలండర్స్.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్స్‌కి చేరింది. అలా తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో తలపడిన డర్బన్ కాలందర్స్, జోబర్గ్ బఫెలోస్ జట్లే ఫైనల్ మ్యాచ్‌లోనూ తలపడడం విశేషం. ఐపీఎల్ 16వ సీజన్‌లోనూ ఇలాగే జరిగింది. తొలి క్వాలిఫైయర్ ఆడిన గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు టోర్నీ ఫైనల్‌లోనూ తలపడ్డాయి. ఇక ఆ మ్యాచ్‌లో ధోని సేన 5వ సారి ఐపీఎల్ కప్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే..

ఇవి కూడా చదవండి

ఫైనల్‌లో తలపడుతున్న ఇరు జట్ల వివరాలు:

డర్బన్ కాలందర్స్ జట్టు: హజ్రతుల్లా జజాయ్, టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఆండ్రీ ఫ్లెచర్, నిక్ వెల్చ్, క్రెయిగ్ ఎర్విన్(కెప్టెన్), ఆసిఫ్ అలీ, జార్జ్ లిండే, అజ్మతుల్లా ఒమర్జాయ్, బ్రాడ్ ఎవాన్స్, టెండై చటారా, తయ్యబ్ అబ్బాస్, డారిన్ తజాప్లోన్, డారిన్, మహమ్మద్ అమీర్, క్లైవ్ మదాండే, హిల్టన్ కార్ట్‌రైట్, సిసంద మగల, ఓవెన్ ముజాండో

జోబర్గ్ బఫెలోస్ జట్టు: మహ్మద్ హఫీజ్(కెప్టెన్), టామ్ బాంటన్ (వికెట్ కీపర్), విల్ స్మీడ్, యూసుఫ్ పఠాన్, రవి బొపారా, ముష్ఫికర్ రహీమ్, వెస్లీ మాధవెరె, వెల్లింగ్టన్ మసకద్జా, నూర్ అహ్మద్, జూనియర్ డాలా, బ్లెస్సింగ్ ముజరబానీ, ఉస్మాన్, ఉస్మాన్, విక్టర్, స్మిత్, మిల్టన్ షుంబా, డెలానో పోట్‌గీటర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..