Virat Kohli – Jay Shah Video: టీమిండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ పాపులారిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు 27 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కోహ్లీని అభిమానించని వారు ఉండరు. బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా విరాట్ కోహ్లీకి అభిమాని. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో ఇందుకు నిదర్శనంగా మారింది.
ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో కప్ సొంతమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ20కి వీడ్కోలు పలికారు. ప్రపంచకప్‌ను ముంబైకి తీసుకొచ్చారు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ప్రపంచకప్ జరిగింది. ఈసారి విరాట్ కోహ్లీ జైషాతో కరచాలనం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది.
జై షా తొలుత కొంతమంది ఆటగాళ్లతో కరచాలనం చేశారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ వచ్చాడు. జై షా కరచాలనం చేశాడు. ఆ తరువాత విరాట్‌ని అలాగే చూస్తుండిపోయాడు. జై షా ఎంతగా మునిగిపోయాడంటే, ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లతో కరచాలనం చేయడం మరిచిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Jay Shah is so me 🥹❤️😭
(The way he kept staring at Virat Kohli and forgot to shake hands 😂)#ViratKohli #IndianCricketTeam #T20WorldCupChampion #T20WorldCup #jayShah pic.twitter.com/HT6C4lFeKO
— Naina_H (@NH_hope13) July 4, 2024
ముంబైలో జులై 4వ తేదీ పండుగ వాతావరణం నెలకొంది. ముంబైలోని మెరైన్‌డ్రైవ్ నుంచి ప్రపంచకప్‌ను ఓపెన్ బస్ పరేడ్‌గా స్టేడియానికి తీసుకొచ్చారు. ఈ సమయంలో లక్షలాది మంది ప్రజలు గుమిగూడారు. అదేవిధంగా వాంఖడే స్టేడియం నిండిపోయింది. ఈ మేరకు ఈ ఓపెన్ పరేడ్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..