IND vs IRE: తొలి ఓవర్‌లోనే 2 వికెట్లు.. పునరాగమన మ్యాచ్‌లో అద్దరగొట్టిన బూమ్రా..

IND vs IRE, 1st T20I: భారత్, ఐర్లాండ్ మధ్య జరుగుతోన్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా తరఫున తొలి ఓవర్ వేసి బూమ్రా 2 వికెట్లతో విజృంభించాడు. డబ్లిన్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బైలింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ ద్వారా ప్రసిద్ధ్ కృష్ట, రింకూ సింగ్ అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశారు. ఐర్లాండ్ సిరీస్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వడంతో టీమిండియాను జస్ప్రీత్ బూమ్రా నడిపిస్తున్నాడు

IND vs IRE: తొలి ఓవర్‌లోనే 2 వికెట్లు.. పునరాగమన మ్యాచ్‌లో అద్దరగొట్టిన బూమ్రా..
IND vs IRE, 1st T20I

Updated on: Aug 18, 2023 | 9:13 PM

IND vs IRE, 1st T20I: దాదాపు 327 రోజుల తర్వాత పునరాగమన మ్యాచ్‌ ఆడుతున్న బూమ్రా తన తొలి ఓవర్‌లోనే సత్తా చాటాడు. భారత్, ఐర్లాండ్ మధ్య జరుగుతోన్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా తరఫున తొలి ఓవర్ వేసి బూమ్రా 2 వికెట్లతో విజృంభించాడు. డబ్లిన్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బైలింగ్ ఎంచుకుంది.

ఇక ఈ మ్యాచ్ ద్వారా ప్రసిద్ధ్ కృష్ట, రింకూ సింగ్ అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశారు. ఐర్లాండ్ సిరీస్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వడంతో టీమిండియాను జస్ప్రీత్ బూమ్రా నడిపిస్తున్నాడు. దీంతో భారత టీ20 జట్టుకు 11వ కెప్టెన్‌గా కూడా బూమ్రా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

4 ఓవర్లు..2 వికెట్లు..

రింకూ ఆరంగేట్రం.. 

మార్పే ఉండదు.. 

కుర్రాళ్ల ఆరంగేట్రం..

మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఒవర్ వేసిన బూమ్రా తొలి బంతికే ఫోర్ ఇచ్చుకున్నాడు. కానీ తర్వాత బంతిని నేరుగా ఐరీష్ ఓపెనర్ ఆండ్రూ బల్బిర్నీ వికెట్లకు తాకేలా వేయడంతో బూమ్రా ఖాతాలో తొలి వికెట్ పడింది. ఆపై వేసిన 5వ బంతిని ఆడిన లోక్రన్ టక్కర్‌ వికెట్ కీపర్ సంజూ శామ్సన్‌కి చిక్కడంతో పెవిలియన్ పంపాడు. ఇలా బూమ్రా పునరాగమనంలోనే ఆకట్టుకున్నాడు.

కాగా, ఈ మ్యాచ్‌ ద్వారా ఆరంగేట్రం చేసిన ప్రసిద్ధ్ కృష్ట కూడా 2 వికెట్లు తీసుకున్నాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us