Jasprit Brumrah : పర్ఫ్యూమ్స్ మీద బుమ్రా పీహెచ్‌డీ చేస్తున్నాడా? అక్షర్ పటేల్ బయటపెట్టిన ఇంట్రెస్టింగ్ సీక్రెట్

Jasprit Brumrah : జస్ప్రీత్ బుమ్రాకు పర్ఫ్యూమ్స్ అంటే పిచ్చి అని అక్షర్ పటేల్ బయటపెట్టాడు. సెంట్ బాటిల్ కొనడానికి బుమ్రా చేసే వింతైన రీసెర్చ్, ఆయన దగ్గర ఉన్న భారీ కలెక్షన్ గురించి పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

Jasprit Brumrah : పర్ఫ్యూమ్స్ మీద బుమ్రా పీహెచ్‌డీ చేస్తున్నాడా? అక్షర్ పటేల్ బయటపెట్టిన ఇంట్రెస్టింగ్ సీక్రెట్
Jasprit Brumrah

Updated on: Dec 29, 2025 | 3:01 PM

Jasprit Brumrah : క్రికెట్ మైదానంలో తన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్ల స్టంప్స్ ఎగురగొట్టే టీమిండియా స్టార్ పేసర్ జస్స్రీత్ బుమ్రా గురించి మనందరికీ తెలుసు. అయితే, గ్రౌండ్ వెలుపల బుమ్రాకి ఉన్న ఒక వింతైన అలవాటు గురించి ఆయన సహచర ఆటగాడు అక్షర్ పటేల్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. బుమ్రాకి క్రికెట్ తర్వాత అంతలా ఇష్టమైన వస్తువు మరొకటి ఉందట. అదే పర్ఫ్యూమ్స్. బుమ్రా దగ్గర ఉన్న సెెంట్ బాటిల్స్ కలెక్షన్ చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందేనని అక్షర్ చెప్పుకొచ్చాడు.

సైంటిస్ట్‌లా రీసెర్చ్ చేస్తాడు

సాధారణంగా ఎవరైనా పర్ఫ్యూమ్ కొనాలంటే షాపుకెళ్లి ఆ సువాసన నచ్చితే వెంటనే కొనేస్తారు. కానీ బుమ్రా స్టైలే వేరు. అక్షర్ పటేల్ ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “జస్సీ భాయ్ పర్ఫ్యూమ్స్ విషయంలో చాలా సీరియస్. ఏదైనా బాటిల్ కొనేముందు దానిపై పీహెచ్‌డీ చేస్తాడు. ఆ సెంట్‌ను కేవలం వాసన చూసి బాగుంది కదా అని కొనడు. అందులో ఎంత శాతం ఆయిల్ ఉంది? దాని గాఢత ఎంత? అది ఎంతసేపు ఉంటుంది? ఇలా ప్రతి చిన్న విషయాన్ని లెక్కలతో సహా చెక్ చేస్తాడు” అని నవ్వుతూ వెల్లడించాడు.

భారీగా పెట్టుబడి

టీమిండియాలోని మిగతా ఆటగాళ్లందరి కంటే బుమ్రా దగ్గర అత్యంత ఖరీదైన, అరుదైన పర్ఫ్యూమ్స్ కలెక్షన్ ఉందట. వీటి కోసం బుమ్రా లక్షల రూపాయలు ఖర్చు చేస్తాడని అక్షర్ పటేల్ తెలిపాడు. విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు కూడా బుమ్రా తనకి కావాల్సిన ప్రత్యేకమైన సువాసనల కోసం గాలిస్తుంటాడట. మైదానంలో బ్యాటర్లకు చుక్కలు చూపించే బుమ్రా, బయట మాత్రం ఇంత సున్నితమైన విషయాలపై శ్రద్ధ చూపిస్తాడని ఎవరూ ఊహించలేదు.

రిటైర్మెంట్ తర్వాత ప్లాన్ అదేనా?

ఈ ఇంటర్వ్యూలో ఒక ఫన్నీ చర్చ కూడా జరిగింది. పర్ఫ్యూమ్స్ మీద బుమ్రాకి ఉన్న పరిజ్ఞానం చూస్తుంటే.. రిటైర్మెంట్ తర్వాత ఆయన సొంతంగా సెంట్ బిజినెస్ ఏమైనా పెడతారా? అని యాంకర్ అడగగా.. దానికి అక్షర్ స్పందిస్తూ.. “జస్సీ భాయ్.. ఒకవేళ పర్ఫ్యూమ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే నన్ను కూడా పార్టనర్‌గా చేసుకో” అంటూ జోక్ చేశాడు. బుమ్రా గ్రౌండ్ లో ఎంత సైలెంట్‌గా ఉంటాడో, బయట తన అభిరుచుల విషయంలో అంత పక్కాగా ఉంటాడని ఈ విషయాలు తెలుపుతున్నాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.