IPL 2026: 4 రోజుల్లో ఐపీఎల్.. ఇంకా టీంలో చేరని టీమిండియా ఛాంపియన్ ప్లేయర్.. అసలేమైంది?

Jasprit Bumrah Injury Update: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ శిబిరంలో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చేరకపోవడం ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో బుమ్రా ఉండటంపై చర్చ జరుగుతోంది. గాయం కారణంగానా లేక సాధారణ ఫిట్‌నెస్ పరీక్షల కోసమేనా అనే దానిపై స్పష్టత కొరవడింది.

IPL 2026: 4 రోజుల్లో ఐపీఎల్.. ఇంకా టీంలో చేరని టీమిండియా ఛాంపియన్ ప్లేయర్.. అసలేమైంది?
Jasprit Bumrah Injury Update

Updated on: Mar 24, 2026 | 7:16 AM

Mumbai Indians: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ శిబిరంలో ఆందోళన మొదలైంది. ఆ జట్టు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇంకా జట్టులో చేరకపోవడం, బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు చేరుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అతను ఏదైనా గాయం కారణంగా అక్కడికి వెళ్ళాడా లేదా సాధారణ ఫిట్‌నెస్ పరీక్షల కోసమేనా అనే దానిపై ప్రస్తుతానికి ఎటువంటి స్పష్టత లేదు.

క్యాష్ రిచ్ లీగ్ ఆరంభానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే సమయం ఉన్నప్పటికీ బుమ్రా ఇంకా ముంబై ఇండియన్స్ శిబిరంలో చేరలేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఆటగాళ్ళు గాయపడినప్పుడు లేదా ఫిట్‌నెస్ పరీక్షల కోసం మాత్రమే ఈ సెంటర్‌కు వెళ్తారు. అయితే బుమ్రా ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు అనే కారణంపై స్పష్టత లేకపోవడంతో క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై ముంబై ఇండియన్స్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే ఇటీవల మాట్లాడుతూ ప్రపంచ కప్ ఆడిన ఆటగాళ్లందరికీ తగినంత విరామం ఇచ్చామని, వారందరూ మార్చి 22 నాటికి జట్టులో చేరతారని చెప్పాడు. కానీ బుమ్రా మాత్రం ఇంకా ప్రాక్టీస్ సెషన్‌కు హాజరు కాలేదు. ఈ టోర్నీలో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ మార్చి 29న వాంఖడే స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడనుంది.

ముంబై ఇండియన్స్ ఫుల్ స్వ్కాడ్: జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, విల్ జాక్స్, క్వింటన్ డి కాక్, ర్యాన్ రికెల్టన్, నమన్ ధీర్, కార్బిన్ బాష్, మిచెల్ సాంట్నర్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, రాబిన్ మింజ్, రాజ్ బావా, అథర్వ అంకోలేకర్, మయాంక్ రావత్, రఘు శర్మ, డానిష్ మలేవార్, మహ్మద్ సలావుద్దీన్ ఇజార్, ఏఎం గజన్‌ఫర్, అశ్వనీ కుమార్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us