ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు.. 20 బంతుల్లో 102 రన్స్.. మొత్తంగా 16 సిక్సర్లతో పరుగుల సునామీ!

|

Sep 12, 2021 | 9:43 AM

అమెరికా, పాపువా న్యూగినియా మధ్య అల్ అమెరాత్‌లో జరిగిన రెండో వన్డేలో భారత సంతతికి చెందిన ఓ బ్యాట్స్‌మెన్ పరుగుల సునామీ..

ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు.. 20 బంతుల్లో 102 రన్స్.. మొత్తంగా 16 సిక్సర్లతో పరుగుల సునామీ!
Jaskaran Malhotra 1
Follow us on

అమెరికా, పాపువా న్యూగినియా మధ్య అల్ అమెరాత్‌లో జరిగిన రెండో వన్డేలో భారత సంతతికి చెందిన ఓ బ్యాట్స్‌మెన్ పరుగుల సునామీ సృష్టించాడు. పలు రికార్డులను తిరగరాశాడు. అతడెవరో కాదు జస్కరన్ మల్హోత్రా. ఈ మ్యాచ్‌లో జస్కరన్ ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టడంతో పాటు భారీ ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.

జస్కరన్ చండీగఢ్‌లో జన్మించాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో హిమాచల్ ప్రదేశ్‌కు జస్కరన్ ప్రాతినిధ్యం వహించాడు. అయితే కొంతకాలం తర్వాత అతడి కుటుంబం అమెరికాలో సెటిల్ కావడంతో.. ప్రస్తుతం యూఎస్ఏ క్రికెట్‌ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. పాపువా న్యూగినియాతో జరిగిన రెండో వన్డేలో జస్కరన్ 16 సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 124 బంతుల్లో 173 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జస్కరన్ తుఫాన్ ఇన్నింగ్స్‌కు అమెరికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఈ సునామీ ఇన్నింగ్స్‌తో జస్కరన్ వన్డే క్రికెట్‌లో సెంచరీ సాధించిన మొదటి అమెరికన్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు.

కష్టాల్లో ఉన్నప్పుడు జట్టును ఆడుకున్న జస్కరన్..

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ దిగిన అమెరికా జట్టు 72 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. స్టీవెన్ టేలర్ (17), సుశాంత్ మోడాని (7), మోనక్ పటేల్ (2), ఆరోన్ జోన్స్ (22) పెవిలియన్‌కు చేరారు. అప్పుడు బరిలోకి దిగిన జస్కరన్.. మొదటి బంతి నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. జస్కరన్ తన పరుగుల వరదను పారిస్తూనే ఉన్నాడు. మొత్తంగా 124 బంతులు ఎదుర్కున్న జస్కరన్ 139.51 స్ట్రైక్ రేట్‌తో 16 సిక్సర్లు, 4 ఫోర్లతో 173 పరుగులు చేశాడు. అంటే బౌండరీల రూపంలో అతడు 20 బంతుల్లో 102 పరుగులు రాబట్టాడు. అలాగే ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఆరు బంతుల్లో 6 సిక్సర్లు కొట్టి రికార్డుల్లోకి ఎక్కాడు.

Also Read: