SA20: ఎస్‌ఏ20 లీగ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్ వర్సెస్ ప్రిటోరియా క్యాపిటల్స్ మధ్య జరిగిన ఓ మ్యాచ్ ఓ ఆశ్చర్యకరమైన క్యాచ్ కనిపించింది. ప్రిటోరియా క్యాపిటల్స్‌కు చెందిన జేమ్స్ నీషమ్ తన క్యాచ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ క్యాచ్‌ని పట్టుకోవడానికి నీషమ్ గాలిలో చాలా అడుగుల ఎత్తుకు ఎగరడం చూసి, అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ఎస్‌ఏ 20 లీగ్ అధికారిక సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ ఘటన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో చోటుచేసుకుంది. ఈ ఓవర్‌ను ప్రిటోరియా క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ ఎన్రిక్ నార్కియా వేశాడు. జోబర్గ్ సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ అల్జారీ జోసెఫ్ నార్కియా వేసిన బంతిని ఆఫ్-స్టంప్ వైపు షాట్ ఆడాడు. అక్కడ ఫీల్డింగ్‌లో ఉన్న జేమ్స్ నీషమ్ ఆశ్చర్యపరిచేలా ఆ బంతిని క్యాచ్ చేశాడు. క్యాచ్ పట్టేందుకు నీషమ్ గాలిలో చాలా అడుగుల ఎత్తుకు దూకినట్లు వీడియోలో చూడొచ్చు.
గాలిలో దూకి క్యాచ్ తీసుకున్న తర్వాత నేలపై పడి రెండు మూడు సార్లు పల్టీలు కొట్టి మళ్లీ పైకి లేచాడు. లాంగ్ జంప్ చూడగానే క్యాచ్ కోసం చాలా రిస్క్ చేశాడని అనిపిస్తుంది. ఈ క్యాచ్‌తో అల్జారీ జోసెఫ్ 5 బంతుల్లో 5 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. జోబర్గ్ సూపర్ కింగ్స్‌కు ఇది 9వ వికెట్.
Jimmy Nesham pulls off an absolute blinder ?#Betway #SA20 #PCvJSK | @Betway_India pic.twitter.com/SxfOKKecTa
— Betway SA20 (@SA20_League) January 18, 2023
ఈ మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జోబర్గ్ సూపర్ కింగ్స్ 15.4 ఓవర్లలో 122 పరుగులకు ఆలౌటైంది. ఇందులో కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ 22 బంతుల్లో 51 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పరుగుల ఛేదనలో ప్రిటోరియా క్యాపిటల్స్ 13 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఇందులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఫిలిప్ సాల్ట్ వేగంగా అర్ధ సెంచరీ సాధించాడు. 30 బంతుల్లో 52 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..