T20 World Cup 2022 Indian Squad: ఆస్ట్రేలియాలో జరగనున్న T20 ప్రపంచ కప్ 2022 కోసం భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ జట్టులోకి తిరిగి వచ్చారు. అదే సమయంలో, ఆసియా కప్ 2022లో తన డెత్ బౌలింగ్ నైపుణ్యంతో ఆకట్టుకున్న లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా 2022 T20 ప్రపంచ కప్‌లోకి ప్రవేశించగలిగాడు. మహ్మద్ షమీ, దీపక్ చాహర్, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్ వంటి ఆటగాళ్లు ఈ జట్టులో చోటు దక్కించుకోనప్పటికీ, ఈ ఆటగాళ్లందరూ టీమిండియా స్టాండ్‌బై ప్లేయర్‌లుగా ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. T20 ప్రపంచ కప్ 2022 జట్టులో చోటు దక్కించుకోని కొందరు దిగ్గజ ఆటగాళ్లను ఇప్పుడు చూద్దాం.
ఇషాన్ కిషన్..
IPL వేలం 2022లో ఇషాన్ కిషన్ రూ. 15 కోట్లు పొందాడు. దాంతో హాట్ టాపిక్ గా మారాడు. అయితే IPLలోని కొన్ని మ్యాచ్‌ల్లో మాత్రమే సత్తా చాటాడు. చాలా మ్యాచ్‌లలో ఇషాన్ కిషన్ బ్యాట్ నిశ్శబ్దంగానే ఉండిపోయింది. అదే సమయంలో, ఆసియా కప్ 2022లో కూడా, ఈ యువ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మన్‌కు టీమ్ ఇండియాలో చోటు దక్కలేదు. ఇప్పుడు T20 ప్రపంచ కప్ 2022 జట్టులో ఎంపిక కాకపోవడం ఇషాన్ కిషన్‌కు పెద్ద దెబ్బగా మారింది.
సంజూ శాంసన్..
రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ 2022 T20 ప్రపంచ కప్‌కు వికెట్ కీపర్‌లుగా ఎంపికయ్యారు. అదే సమయంలో సంజూ శాంసన్‌కు టీమిండియాలో చోటు దక్కలేదు. నిజానికి ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోపంతో ఉన్న అభిమానులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సంజూ శాంసన్‌ను ఆసియా కప్ 2022కి కూడా భారత జట్టులో ఎంపిక చేయలేదు. ఆ తర్వాత చాలా ప్రశ్నలు తలెత్తాయి. అయితే 2022 ఆసియా కప్‌లో రిషబ్ పంత్ ప్రదర్శన ఆశించినంతగా లేదు. అయినా టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. సంజూ శాంసన్‌కు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కుతుందని భావించినా, అది జరగలేదు. దీంతో ఫ్యాన్స్ బీసీసీఐ పై నిప్పుల వర్షం కురిపిస్తున్నారు.
శ్రేయాస్ అయ్యర్..
భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ రాబోయే ప్రపంచ కప్‌లో టీమిండియాలో చోటు దక్కించుకోలేదు. అయితే ఈ యువ బ్యాట్స్‌మెన్‌ని స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపిక చేశారు. 2022 ఆసియా కప్‌లో కూడా శ్రేయాస్ అయ్యర్‌కు భారత జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. అసలైన, ఆసియా కప్ 2022లో చోటు దక్కించుకోకపోవడంతో, ఈ యువ బ్యాట్స్‌మెన్ ప్రపంచ కప్ జట్టులో స్థానం పొందగలడని అభిమానులు ఆశించారు. కానీ ఇప్పుడు ఈ ఆటగాడు టీమ్ ఇండియాతో పాటు ఆస్ట్రేలియాకు స్టాండ్‌బై ప్లేయర్‌గా వెళ్లనున్నాడు.
టీ20 ప్రపంచకప్ కోసం టీం ఇండియా – రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (కీపర్), దినేష్ కార్తీక్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్.
స్టాండ్‌బై ఆటగాళ్లు- మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్.