
Ishan Kishan Injury Update: న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా (Team India) ఇప్పటికే మూడు మ్యాచ్‌లను గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన తొలి రెండు మ్యాచ్‌లలో విజయాలు సాధించిన భారత్.. వెల్లింగ్టన్‌లో జరిగిన మూడో టీ20లోనూ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆక్లాండ్‌లో జరిగే నాలుగో టీ20కి ముందు భారత జట్టుకు కీలక అప్‌డేట్ వచ్చింది.
గాయం కారణంగా రెండో, మూడో టీ20లకు దూరమైన ఇషాన్ కిషన్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. రెవ్‌స్పోర్ట్జ్ జర్నలిస్ట్ శుభాయన్ చక్రవర్తి ప్రకారం.. ఇషాన్ చివరి రెండు టీ20లకు పూర్తిగా ఫిట్‌గా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
మొదటి టీ20లో ఇషాన్ కిషన్ కుడి తొడ భాగంలో స్వల్ప స్థాయి గాయం బారిన పడ్డాడు. దీంతో రెండో మ్యాచ్‌కు అతడిని తప్పించారు. అతడి స్థానంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) జట్టులోకి వచ్చాడు. క్రైస్ట్‌చర్చ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన వైభవ్.. వెల్లింగ్టన్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.
Abhishek Sharma: 4 ఫోర్లు, 6 సిక్స్‌లు.. 15 బంతుల్లోనే అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ!
వెల్లింగ్టన్‌లో వైభవ్ తన అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. కేవలం 19 బంతుల్లోనే 45 పరుగులు చేసి భారత్‌కు మెరుపు ఆరంభం అందించాడు. దీంతో ఇషాన్ తిరిగి వస్తే వైభవ్‌కు చోటు దక్కుతుందా అనే ఆసక్తి మొదలైంది.
ఇషాన్ ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందితే భారత జట్టు గతంలో ఉపయోగించిన టాప్ ఆర్డర్ కాంబినేషన్‌నే కొనసాగించే అవకాశం ఉంది. ఇషాన్‌తో పాటు సంజూ శాంసన్ (Sanju Samson), అభిషేక్ శర్మ (Abhishek Sharma) టాప్ ఆర్డర్‌లో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు కొట్టిన కాటేరమ్మ కొడుకు.. లిస్ట్‌లో తొలి ప్లేయర్‌గా నయా హిస్టరీ..!
అదే జరిగితే వెల్లింగ్టన్‌లో 19 బంతుల్లో 45 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీకి తుది రెండు మ్యాచ్‌లలో చోటు దక్కకపోవచ్చు. రెండో టీ20లో సింగిల్ డిజిట్ స్కోర్ చేసిన వైభవ్.. మూడో మ్యాచ్‌లో మాత్రం తన సత్తా చాటాడు.
ఇక వెస్టిండీస్‌తో జరిగిన గత టీ20 సిరీస్‌లో ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 153 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ సగటు 38.25గా, స్ట్రైక్ రేట్ 191.25గా ఉంది.
న్యూజిలాండ్‌తో నాలుగో టీ20 ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో జరగనుంది. చివరి మ్యాచ్ హామిల్టన్‌లోని సెడ్డన్ పార్క్‌లో జరగనుంది. ఇషాన్ ఫిట్‌గా తిరిగొస్తే ఈ రెండు మ్యాచ్‌ల్లో భారత టాప్ ఆర్డర్‌పై ఆసక్తి మరింత పెరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..