Ishan Kishan Auction Price: వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ నక్క తోక తొక్కాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో భారీ ధర పలికాడు. ఏకంగా రూ.15.25 కోట్ల ధర పలికాడు. గత సీజన్‌లో అతను ముంబై ఇండియన్స్ తరఫున ఆడారు. కానీ అతన్ని ఆ జట్టు రిటైన్ చేసుకోలేదు. నలుగురు ఆటగాళ్లనే రిటైన్ చేసుకోవాలన్న నిబంధనతో అతన్ని రిటైన్ తీసుకోలేదు. మెగా వేలంలో అతన్ని ఎలాగైనా దక్కించుకోవాలని ఆ జట్టు తీవ్రంగా ప్రయత్నించింది. అతని కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా పోటీ పడినా ఇషాన్ కిషన్‌ను చివరికి ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ఇషాన్ కిషన్ కనీస ధర రూ. 2 కోట్లుగా ఉంది.
ఇషాన్ కిషన్ కోసం మొదటగా ముంబై ఇండియన్స్ వేలం ప్రారంభించింది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ వేలానికి వచ్చింది. దీంతో వేలం వెంటనే ఆరు కోట్లకు చేరుకుంది. అప్పుడు గుజరాత్ టైటాన్స్ రూ.10 కోట్లకు వేలం పాడింది. అప్పుడే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రేసులోకి వచ్చింది. తీవ్ర పోటీ తర్వాత ఇషాన్ కిషన్ ముంబై తన సొంతం చేసుకుంది. 2016 ప్రపంచకప్‌లో భారత అండర్-19 జట్టును ఇషాన్ కిషన్ ఫైనల్‌కు చేర్చాడు.
2016 వేలంలో తొలిసారిగా గుజరాత్ లయన్స్ అతడిని కొనుగోలు చేసింది. ఇషాన్‌ను 20 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది. అతను రెండేళ్లపాటు ఈ ఫ్రాంచైజీలో ఉన్నాడు. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత 2018 వేలంలో అతడిని ముంబై ఇండియన్స్ రూ. 6.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఇషాన్ 2020 సీజన్‌లో ముంబై తరపున 14 మ్యాచ్‌లలో 57.33 సగటుతో 145.76 స్ట్రైక్ రేట్‌తో 516 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో ఇషాన్ 30 సిక్సర్లు కొట్టాడు. అయితే, గత సీజన్ అతనికి అంతగా లేదు. 241 పరుగులు చేశాడు.
“Our story is just getting started.” – Ishan Kishan ?
We agree, 100% ?#OneFamily #MumbaiIndians #AalaRe #IPLAuction @ishankishan51 pic.twitter.com/yvL8fnnEgN
— Mumbai Indians (@mipaltan) February 12, 2022
Read Also… Gujarat Titans IPL 2022 Auction: గుజరాత్ టైటాన్స్ టీంలో చేరిన ప్లేయర్లు వీరే..!