Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: చప్పట్లతో కావ్య పాప ఫుల్ ఖుషీ.. కట్‌చేస్తే.. ప్లయింగ్ కిస్‌తో షాకిచ్చిన ఇషాన్ కిషన్..

అభిషేక్ 24 పరుగులకే ఔటయ్యాడు. కానీ ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ భారీ స్కోర్లు సాధించి SRH ఐపీఎల్ చరిత్రలో ఐదవ అత్యధిక పవర్-ప్లే స్కోరును నమోదు చేశారు. హెడ్ పెవిలియన్ చేరిన తర్వాత ఇషాన్ కిషన్.. టాక్ ఆఫ్ ది ఉప్పల్‌గా మారిపోయాడు. ఈ బ్యాటర్ 25 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి తన విమర్శకుల నోళ్లు మూయించాడు.

Video: చప్పట్లతో కావ్య పాప ఫుల్ ఖుషీ.. కట్‌చేస్తే.. ప్లయింగ్ కిస్‌తో షాకిచ్చిన ఇషాన్ కిషన్..
Kavya Maran Ishan Kishan
Follow us
Venkata Chari

|

Updated on: Mar 23, 2025 | 5:27 PM

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను చిత్తు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్‌.. కేవలం 25 బంతుల్లో అర్ధ సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో మైదానంలో ఓ ఆసక్తికరమైన సీన్ చోటుచేసుకుంది.

రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. ఈక్రమంలో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ హైదరాబాద్ జట్టుకు అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. ఈ డేంజరస్ జోడీ 19 బంతుల్లోనే 45 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి

హాఫ్ సెంచరీ తర్వాత ఇషాన్ కిషన్ ఫ్లయింగ్ కిస్..

అభిషేక్ 24 పరుగులకే ఔటయ్యాడు. కానీ ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ భారీ స్కోర్లు సాధించి SRH ఐపీఎల్ చరిత్రలో ఐదవ అత్యధిక పవర్-ప్లే స్కోరును నమోదు చేశారు. హెడ్ పెవిలియన్ చేరిన తర్వాత ఇషాన్ కిషన్.. టాక్ ఆఫ్ ది ఉప్పల్‌గా మారిపోయాడు. ఈ బ్యాటర్ 25 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి తన విమర్శకుల నోళ్లు మూయించాడు.

వరుస సిక్సర్లతో ఈ మైలురాయిని చేరుకున్న తర్వాత, ఇషాన్ తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయాడు. అక్కడున్న ప్రేక్షకులకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఇషాన్ కిషన్ ఊచకోత చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.

ఐపీఎల్ 2025తో కెరీర్‌ తిరిగి ప్రారంభించనున్నాడా?

2024 ప్రారంభంలో భారత జట్టు నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అతను తన BCCI సెంట్రల్ కాంట్రాక్టును కూడా కోల్పోయాడు. చివరికి, ఇషాన్ స్టాక్స్ పడిపోవడంతో రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, సంజు సామ్సన్ వంటి ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు.

అయితే, ప్రస్తుత సీజన్ ఇషాన్ జట్టులో తన స్థానాన్ని తిరిగి పొందాలని చూస్తున్నందున అతని కెరీర్‌ను తిరిగి పునరుజ్జీవింపజేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..