IPL 2023: ధోనికి కోహ్లీ దెబ్బ.! ఆ రెండు జట్ల గండం.. తేడా వస్తే సరాసరి ఇంటికే..

|

May 16, 2023 | 6:50 PM

ఐపీఎల్ 16వ సీజన్‌లో లీగ్ స్టేజి దాదాపుగా చివరి దశకు చేరింది. ప్లేఆఫ్స్ దగ్గర పడుతున్నా.. గుజరాత్ టైటాన్స్ జట్టు తప్పితే.. మిగిలిన మూడు జట్లు ఖరారు కాలేదు.

IPL 2023: ధోనికి కోహ్లీ దెబ్బ.! ఆ రెండు జట్ల గండం.. తేడా వస్తే సరాసరి ఇంటికే..
Csk
Follow us on

ఐపీఎల్ 16వ సీజన్‌లో లీగ్ స్టేజి దాదాపుగా చివరి దశకు చేరింది. ప్లేఆఫ్స్ దగ్గర పడుతున్నా.. గుజరాత్ టైటాన్స్ జట్టు తప్పితే.. మిగిలిన మూడు జట్లు ఖరారు కాలేదు. గతేడాది పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ప్రస్తుత సీజన్‌లో దుమ్మురేపుతున్నాయి. మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే.. రోహిత్ సేన టాప్ 2కి వెళ్లడం ఖాయం. అయితే చెన్నై సూపర్ కింగ్స్‌కి మాత్రం కొంచెం రిస్క్‌లో పడిందనే చెప్పాలి. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓడిపోవడంతో.. ఇక ఆ జట్టుకు మిగిలింది లీగ్ స్టేజిలో ఢిల్లీతో లాస్ట్ మ్యాచ్. ఒకవేళ ఇందులో ధోనిసేన ఓడిపోతే.. సీఎస్‌కే 15 పాయింట్లతో మిగిలిపోతుంది.

అటు విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధిస్తే.. 16 పాయింట్లతో టాప్ 3లోకి వెళ్లడం పక్కా. అటు లక్నో సూపర్ జెయింట్స్ ఒక్క మ్యాచ్ ఓడినా.. లాస్ట్ మ్యాచ్‌లో గెలిచినా 15 పాయింట్లతో లీగ్ స్టేజి పూర్తి చేసుకుంటుంది. ఒకవేళ ఇలా జరిగితే.. లక్నో కంటే చెన్నై మెరుగైన రన్‌రేట్ ఉంటేనే.. ప్లేఆఫ్స్ చేరుతుంది. లేదంటే.. బెంగళూరు, ముంబైతో పాటు లక్నో జట్లు.. గుజరాత్‌తో కలిసి ప్లేఆఫ్స్ ఆడతాయి. కాగా, ధోని అభిమానులు మాత్రం సీఎస్కే తన చివరి మ్యాచ్‌లో ఢిల్లీని మట్టికరిపించి ప్లేఆఫ్స్ చేరుతుందని అంటున్నారు.