Womens T20 World Cup 2026 : రెండ్రోజులైనా కాలేదు.. మరో చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ టీం.. షాక్‎లో క్రికెట్ అభిమానులు

Womens T20 World Cup 2026 : టీ20 మహిళల ప్రపంచకప్ 2026లో ఐర్లాండ్ మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఓర్లా ప్రెండర్గాస్ట్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఐర్లాండ్ క్రికెట్‌లో మరో మైలురాయి చేరుకుంది.

Womens T20 World Cup 2026 : రెండ్రోజులైనా కాలేదు.. మరో చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ టీం.. షాక్‎లో క్రికెట్ అభిమానులు
Womens T20 World Cup 2026

Updated on: Jun 28, 2026 | 8:04 AM

Womens T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఐర్లాండ్ మహిళా క్రికెట్ జట్టు ఒక అద్భుతాన్ని సృష్టించింది. శనివారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించి, ప్రపంచకప్‌లో తమ మొదటి చారిత్రాత్మక గెలుపును నమోదు చేసుకుంది. కేవలం ఒక రోజు ముందుగానే ఐర్లాండ్ పురుషుల జట్టు టీమిండియాను ఓడించి సంచలనం సృష్టించగా, అదే స్ఫూర్తితో మహిళా క్రీడాకారిణులు కూడా మైదానంలో మెరిశారు. సెమీస్ రేసు నుంచి ఇప్పటికే బయటకు వచ్చినప్పటికీ, ఈ విజయం ఆ దేశ క్రికెట్ అభిమానులకు తీపి గుర్తుగా మిగిలిపోయింది. ఈ గెలుపు వారి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ముఖ్యంగా పురుషుల జట్టు టీమిండియాను ఓడించిన ఉత్సాహం మహిళా క్రీడాకారిణుల్లో కూడా స్పష్టంగా కనిపించింది. ఆ మ్యాచ్ చూసి ప్రేరణ పొందిన మహిళా క్రీడాకారిణులు, తాము ఏమాత్రం తీసిపోమని నిరూపించారు.

ఓర్లా ప్రెండర్గాస్ట్ మెరుపులు

ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ మొదట బౌలింగ్‌లో రాణించింది. వెస్టిండీస్ జట్టును కేవలం 128 పరుగులకే కట్టడి చేసింది. వెస్టిండీస్ తరపున చినెల్లీ హెన్రీ (27) టాప్ స్కోరర్‌గా నిలిచారు. లక్ష్య ఛేదనలో ఓర్లా ప్రెండర్గాస్ట్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. కేవలం 44 బంతుల్లో 63 పరుగులు చేసి, జట్టును విజయతీరాలకు చేర్చారు. ఆమె ఇన్నింగ్స్‌లో 2 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. 18.1 ఓవర్లలోనే జట్టు లక్ష్యాన్ని చేరుకుని, క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయేలా గెలుపును అందుకుంది.

సెమీస్‌కు వెస్టిండీస్

ఓటమి పాలైనప్పటికీ, వెస్టిండీస్ మహిళా జట్టు సెమీ ఫైనల్ చేరుకోవడంలో సఫలమైంది. గ్రూప్-బి నుంచి ఇంగ్లాండ్ అగ్రస్థానంలో నిలిచి సెమీస్ బెర్తు దక్కించుకుంది. వెస్టిండీస్, శ్రీలంక చెరో 6 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ, మెరుగైన నెట్ రన్ రేట్ (-0.147) ఆధారంగా వెస్టిండీస్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. శ్రీలంక (-0.725) రన్ రేట్ తక్కువగా ఉండటంతో సెమీస్ అవకాశాన్ని కోల్పోయింది.

పురుషుల జట్టు ప్రేరణ

ముందు రోజు పురుషుల జట్టు టీమిండియాను ఓడించిన వీడియోను మహిళా క్రీడాకారిణులు అందరూ కలిసి చూశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అయింది. ఇది ఆ జట్టు మహిళా క్రీడాకారిణులకు ఎంతటి స్ఫూర్తిని ఇచ్చిందో ఇప్పుడు వారు సాధించిన విజయమే చెబుతోంది. ఎంతటి బలమైన జట్టుకైనా సరైన ప్రణాళికతో చెక్ పెట్టవచ్చని ఐరిష్ క్రీడాకారిణులు నిరూపించారు.

 

మరిన్ని ఆసక్తికర క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us