AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పులిలాంటి టీమిండియాను పసికూన ఐర్లాండ్‌ ఎలా ఓడించింది? వాళ్ల వెనకున్న శక్తి ఇదేనా?

టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన టీమిండియాను పసికూన ఐర్లాండ్ 0-2తో ఓడించి షాకిచ్చింది. ఆరుగురు కోచ్‌లతో ఉన్న టీమిండియాపై, కేవలం ఇద్దరు కోచ్‌లతో ఐర్లాండ్ ఈ అద్భుతం చేసింది. యువ బౌలర్లు జై మూంద్రా, మాథ్యూ హోలార్డ్ 11 వికెట్లు తీసి చరిత్ర సృష్టించారు.

పులిలాంటి టీమిండియాను పసికూన ఐర్లాండ్‌ ఎలా ఓడించింది? వాళ్ల వెనకున్న శక్తి ఇదేనా?
Ireland Won T20 Series Agai
SN Pasha
|

Updated on: Jun 29, 2026 | 9:37 AM

Share

టీ20 వరల్డ్‌ కప్‌ 2026 గెలిచి పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత.. తొలి టీ20 సిరీస్‌, అది కూడా పసికూన ఐర్లాండ్‌పై, వెళ్తోంది యంగ్‌ టీమిండియా, అందులోనూ అరివీర భయంకరంగా బ్యాటింగ్‌ చేసే బ్యాటర్లు ఉన్న టీమ్‌. ఇక రికార్డులతో ఐర్లాండ్‌ సిరీస్‌ ముగుస్తుంది అనుకుంటే.. అత్యంత చెత్త ఆటతో టీమిండియా, అద్భుతమైన పోరాటంతో ఐర్లాండ్‌ క్రికెట్‌ లోకాన్ని షాక్‌కు గురి చేశాయి. రెండు టీ20ల సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేస్తూ ఐర్లాండ్‌ చరిత్రలో నిలిచిపోయే ఆట ఆడింది. అయితే ఒక మ్యాచ్‌ గెలిస్తే.. ఏదో లక్‌ అనుకోవచ్చు, కానీ వరుసగా రెండు సార్లు మట్టికరిపిస్తే.. వారిది లక్‌ కాదు కష్టానికి ఫలితం అనే చెప్పాలి. మరి పులిలాంటి టీమిండియాపై పసికూన ఐర్లాండ్‌ ఎలా గెలిచింది? వారిని అంత బలంగా నడిపించిన శక్తి ఏంటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

మీకో ఆశ్చర్యకరమైన విషయం తెలుసా.. మన టీమిండియాకు మొత్తం ఆరుగురు కోచ్‌లు ఉన్నారు. హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, అసిస్టెంట్‌ కోచ్‌ ర్యాన్‌ టెన్‌డస్కటే, బౌలింగ్‌ కోచ్‌ మోర్ని మార్కెల్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ టీ.దిలీప్‌, బ్యాటంగ్‌ కోచ్‌ సితాన్షు కోటక్‌, స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌ సైరాజ్‌ బహుతులే. ఇంతమంది హేమాహేమీలు టీమిండియాకు కోచింగ్‌ ఇస్తూ నెట్స్‌లో తెగ కష్టపడుతున్నారు. మరి ఐర్లాండ్‌కు ఎంతమంది కోచ్‌లు ఉన్నారో తెలుసా? కేవలం ఇద్దరు, ఒకరు బ్యాటింగ్‌ కోచ్‌ హెన్రిచ్‌ మలాన్‌, బౌలింగ్‌ కోచ్‌ రయాన్ ఈగల్సన్. మలాన్‌ సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ కాగా, ఈగల్సన్‌ ఐర్లాండ్‌ మాజీ క్రికెటర్‌. కేవలం ఇద్దరంటే ఇద్దరు కోచింగ్‌ స్టాఫ్‌తోనే ఐర్లాండ్‌ అద్భుతం చేసింది.

అయితే కేవలం కోచింగ్‌ వల్లే ఐర్లాండ్‌కు ఈ అద్బుతం సాధ్యమైందా? అంటే ఆటగాళ్ల ప్రతిభను తక్కువ చేసినట్టే అవుతుంది. ముఖ్యంగా ఇద్దరి గురించి మాట్లాడుకోవాలి. జై మూంద్రా, మాథ్యూ హోలార్డ్.. ఈ ఇద్దరు బౌలర్లు టీమిండియా పాలిట యమగండంలా మారారు. పైగా ఇద్దరికి ఇదే తొలి టీ20 సిరీస్‌. ఈ సిరీస్‌కంటే ముందు ఒక్క అంతర్జాతీయ టీ20 కూడా ఆడలేదు కానీ, ఇద్దరు కలిసి ఈ రెండు టీ20ల సిరీస్‌లో ఏకంగా 11 వికెట్లు పడగొట్టారు. మూంద్రా 5, హోల్డర్‌ 6 వికెట్లు తీసుకున్నారు. ఆదివారం జరిగిన రెండో టీ20లో ఇద్దరు చెరో మూడేసి వికెట్లు పడగొట్టి.. టీమిండియా ఓటమిని శాసించారు. మరో విశేషం ఏంటే.. జై మూంద్రా మనోడే, రాజస్థాన్‌కు చెందిన కుర్రాడు. ఐర్లాండ్‌లో స్థిరపడి అక్కడి జాతీయ జట్టుకు ఆడుతున్నాడు. ఇలా తక్కువ మంది కోచింగ్‌ స్టాఫ్‌, అద్భుతమైన యంగ్‌ టాలెంట్‌తో ఐర్లాండ్‌ టీమిండియాను ఓడించింది. వారి వెనకున్న శక్తి మరేందో కాదు.. ఏ టీమ్‌నైనా ఓడించగలం అనే ఆత్మవిశ్వాసం. అదే వారిని ఈ చరిత్ర సృష్టించేలా చేసింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఐర్లాండ్‌ వెనకున్న శక్తి ఎవరు? టీమిండియానే ఓడించేంత బలం ఎక్కడిది?
ఐర్లాండ్‌ వెనకున్న శక్తి ఎవరు? టీమిండియానే ఓడించేంత బలం ఎక్కడిది?
ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే రోజంతా ఎనర్జీగా ఉంటారు
ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే రోజంతా ఎనర్జీగా ఉంటారు
ఉదయ్ కిరణ్ చనిపోయాక ఆ హీరో మా ఇంటికి వచ్చి ఏం చెప్పాడంటే..
ఉదయ్ కిరణ్ చనిపోయాక ఆ హీరో మా ఇంటికి వచ్చి ఏం చెప్పాడంటే..
ప్రతిరోజూ పరగడుపునే అల్లం నీరు తాగి చూడండి.. శరీరంలో జరిగేది ఇదే!
ప్రతిరోజూ పరగడుపునే అల్లం నీరు తాగి చూడండి.. శరీరంలో జరిగేది ఇదే!
కోటి రూపాయల అప్పు ఉన్నా క్షణంలో తీరిపోవాలా.. పౌర్ణమి రోజు ఇలా..
కోటి రూపాయల అప్పు ఉన్నా క్షణంలో తీరిపోవాలా.. పౌర్ణమి రోజు ఇలా..
"ముందు మీ దేశాన్ని చూసుకోండి".. పాక్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్!
ఓటీటీలో రచ్చ చేస్తున్న సినిమా.. ఆ ఫ్యామిలీ దెబ్బకు అందరూ అవుట్..
ఓటీటీలో రచ్చ చేస్తున్న సినిమా.. ఆ ఫ్యామిలీ దెబ్బకు అందరూ అవుట్..
ఐరోపాలో నిప్పుల కొలిమి.. 9 రోజుల్లో 13 వేల మంది మృతి..
ఐరోపాలో నిప్పుల కొలిమి.. 9 రోజుల్లో 13 వేల మంది మృతి..
ఒకప్పుడు పొలాల్లో కూలి పని.. ఇప్పుడు నెలకు రూ.50 వేల సంపాదన..
ఒకప్పుడు పొలాల్లో కూలి పని.. ఇప్పుడు నెలకు రూ.50 వేల సంపాదన..
గుమ్మడి గింజలు అమృతం అనుకుంటే పొరపాటే.. ఎక్కువగా తింటే ఈ తీవ్రమైన
గుమ్మడి గింజలు అమృతం అనుకుంటే పొరపాటే.. ఎక్కువగా తింటే ఈ తీవ్రమైన