IPL 2021: ప్లేఆఫ్‌లో నంబర్ 4 ఎవరు.. రోహిత్, మోర్గాన్, శాంసన్‌లలో ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయో తెలుసా?

|

Oct 04, 2021 | 10:48 AM

IPL Playoffs: ప్లేఆఫ్‌లో నాల్గవ స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొంది. కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్‌ టీంలలో ఎవరు ప్లేఆఫ్‌లో చేరనున్నారో తెలుసుకుందాం.

IPL 2021: ప్లేఆఫ్‌లో నంబర్ 4 ఎవరు.. రోహిత్, మోర్గాన్, శాంసన్‌లలో ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయో తెలుసా?
Ipl 2021 Mi Vs Rr Vs Kkr
Follow us on

IPL 2021: ప్లేఆఫ్‌లో ప్రస్తుతం ఒక ప్లేస్ మిగిలి ఉంది. ఇప్పటికే మూడు జట్లు తొలి మూడు స్థానాల్లో చేరాయి. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంలు ప్లే ఆఫ్‌లో చోటు దక్కించుకున్నాయి. బెంగళూరు, ఢిల్లీ టీంలు వరుసగా రెండవ సంవత్సరం ప్లేఆఫ్‌లో తమ బెర్త్‌లను నిర్ధారించుకున్నాయి. అదే సమయంలో, గత సీజన్‌లో మొదటి ప్లేఆఫ్ రేసులో లేని చెన్నై జట్టు ఈ సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరుకున్న మొదటి జట్టుగా నిలిచింది.

ప్రస్తుతం మిగిలిన నాలుగో స్థానంపై మూడు జట్లు కన్నేశాయి. అయితే ప్లేఆఫ్‌లో ఏజట్టు చేరుతుందో తెలుసుకోవాలంటే.. తాజా పరిస్థితిని పరిశీలించడం ఎంతో అవసరం. చెన్నై, ఢిల్లీ రెండూ ప్రస్తుతం తలో 18 పాయింట్లను కలిగి ఉన్నాయి. అయితే మెరుగైన రన్ రేట్ కారణంగా చెన్నై అగ్రస్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్‌ను ఓడించిన తర్వాత, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 పాయింట్లను కలిగి ఉంది. ఈ జట్టు పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ కూడా ప్లేఆఫ్ రేసులో ఉన్నప్పటికీ అక్టోబర్ 3 న ఆర్‌సీబీతో జరిగిన మ్యాచులో ఓటమితో వారి ఆశలకు గండి పడింది.

ప్లేఆఫ్‌లో ‘నంబర్ 4’ ఎవరు..
ప్రస్తుతం ప్లేఆఫ్‌లో 4వ స్థానం మిగిలి ఉంది. అంటే, ఇందుకోసం ముగ్గురు పోటీదారులు బరిలో ఉన్నారు. ప్లేఆఫ్‌లో నాల్గవ స్థానానికి కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఈ మూడు జట్లలో కోల్‌కతా 13 మ్యాచ్‌ల తర్వాత 12 పాయింట్లను కలిగి ఉంది. ప్రస్తుతం నాల్గవ స్థానంలో ఉంది. అదే సమయంలో రాజస్థాన్, ముంబై 12 మ్యాచ్‌ల తర్వాత తలో 10 పాయింట్లను కలిగి ఉన్నాయి. ఈ రెండు జట్లు 6, 7 వ స్థానంలో నిలిచాయి.

కోల్‌కతా టీం లెక్కలు..
ప్రస్తుతం ఈ మూడు జట్లలో కోల్‌కతా టీం తమ చివరి మ్యాచ్ గెలిస్తేనే ప్లేఆఫ్‌కు చేరుకోగలదు. ఈ జట్టుకు కలిసొచ్చే అంశం దాని నెట్ రన్ రేట్ ప్లస్‌లో ఉండడమే. అయితే సమస్య ఏమిటంటే, కోల్‌కతా తన చివరి మ్యాచ్‌ని రాజస్థాన్ రాయల్స్‌తో ఆడవలసి ఉంది. ఈ జట్టు కూడా ప్లేఆఫ్స్ రేసులో ఉండడంతో పోటీ చాలా కఠినంగా ఉండే అవకాశం ఉంది.

రాజస్థాన్ జాతకం..
ప్లేఆఫ్‌కు వెళ్లే మార్గంలో మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తేనే రాజస్థాన్ రాయల్స్‌కు అవకాశం ఉంటుంది. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ కూడా ఉంది. చివరి మ్యాచ్‌లో సీఏస్‌కేని ఓడించడంతో ఈ జట్టు రన్ రేట్ విషయంలో ముంబై ఇండియన్స్ కంటే మెరుగ్గా మారింది. అటువంటి పరిస్థితిలో తర్వాతి రెండు మ్యాచ్‌లు గెలిస్తే, ఆర్‌ఆర్‌కు 14 పాయింట్లు ఉంటాయి. ప్లేఆఫ్‌కు చేరుకునే అన్ని అవకాశాలు లభిస్తాయి.

ముంబైకి ఉన్న అవకాశాలు..
ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశాలు ప్రస్తుతం వారి బలమైన ప్రదర్శనపై ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే రోహిత్ శర్మ సేన మిగిలిన రెండు మ్యాచుల్లో తప్పక గెలవడమే కాకుండా వారి రన్ రేట్ కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. ముంబై తదుపరి రెండు మ్యాచ్‌లను రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లు సులువుగా ఉండకపోవచ్చు.

Also Read: T20 World Cup: క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. దాయాదుల పోరును ప్రత్యక్షంగా చూసే ఛాన్స్.. టికెట్ల అమ్మకాలు షురూ

35 ఏళ్ల వయస్సులో టెస్ట్ అరంగేట్రం.. తొలి మ్యాచులోనే సెంచరీతో ప్రపంచ రికార్డు.. బ్రాడ్‌మాన్ తరువాతి స్థానంలో నిలిచిన ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే?