IPL 2026 Auction : ఆక్షన్ అప్పుడే మొదలైంది.. ఆ స్టార్ ప్లేయర్‎కు ఏకంగా రూ.30.5 కోట్లు, సర్ఫరాజ్ ఖాన్‌కు రూ.7 కోట్లు

IPL 2026 Auction : ఐపీఎల్ 2026 కోసం మినీ ఆక్షన్ త్వరలో అబుదాబిలో జరగనుంది. ఈ ఆక్షన్‎కు ముందు, కొంతమంది క్రికెట్ నిపుణులు, మాజీ ఆటగాళ్లు ఒక మాక్ ఆక్షన్ నిర్వహించారు. ఈ మాక్ ఆక్షన్‌లో ఏయే ఆటగాళ్లకు ఎంత భారీ ధర పలకవచ్చో అంచనా వేశారు.

IPL 2026 Auction : ఆక్షన్ అప్పుడే మొదలైంది.. ఆ స్టార్ ప్లేయర్‎కు  ఏకంగా రూ.30.5 కోట్లు, సర్ఫరాజ్ ఖాన్‌కు రూ.7 కోట్లు
Cameron Green

Updated on: Dec 15, 2025 | 4:00 PM

IPL 2026 Auction : ఐపీఎల్ 2026 కోసం మినీ ఆక్షన్ త్వరలో అబుదాబిలో జరగనుంది. ఈ ఆక్షన్‎కు ముందు, కొంతమంది క్రికెట్ నిపుణులు, మాజీ ఆటగాళ్లు ఒక మాక్ ఆక్షన్ నిర్వహించారు. ఈ మాక్ ఆక్షన్‌లో ఏయే ఆటగాళ్లకు ఎంత భారీ ధర పలకవచ్చో అంచనా వేశారు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఈ మాక్ ఆక్షన్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ క్యామరూన్ గ్రీన్, భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్ పై భారీ డబ్బు కురిసింది.

స్టార్ స్పోర్ట్స్ మాక్ ఆక్షన్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ క్యామరూన్ గ్రీన్‌కు అత్యంత భారీ ధర పలికింది. కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప బిడ్ వేయగా, వారు గ్రీన్‌ను ఏకంగా రూ.30.5 కోట్లకు కొనుగోలు చేశారు. ఐపీఎల్ ఆక్షన్‌లో అత్యధిక ధర పలికే ఆటగాడిగా గ్రీన్ రికార్డు సృష్టించే అవకాశం ఉందని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మాక్ ఆక్షన్ ఫలితాలు ఈ అంచనాలను మరింత బలోపేతం చేశాయి.

ఈ మాక్ ఆక్షన్‌లో భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్‌పై కూడా బాగా డబ్బు కురిసింది. చెన్నై సూపర్ కింగ్స్ తరపున సురేష్ రైనా బిడ్డింగ్‌లో పాల్గొని, సర్ఫరాజ్ ఖాన్‌ను రూ.7 కోట్లకు కొనుగోలు చేశారు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్‌పై ఐపీఎల్ ఆక్షన్ 2026లో భారీ దావ్ పడే అవకాశం ఉందని ఈ మాక్ ఆక్షన్ సూచిస్తోంది. సర్ఫరాజ్ ఖాన్ చివరిసారిగా ఐపీఎల్ 2021లో ఆడాడు.

ఇంగ్లాండ్‌కు చెందిన ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ కూడా ఈ మాక్ ఆక్షన్‌లో మంచి ధర పలికాడు. లక్నో టీమ్ తరపున బిడ్డింగ్ వేసిన మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, లివింగ్‌స్టోన్‌ను రూ.19 కోట్లకు కొనుగోలు చేశారు. లివింగ్‌స్టోన్ గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఉన్నాడు. ఇతను పవర్ హిట్టింగ్‌తో పాటు, ఆఫ్‌స్పిన్, లెగ్‌స్పిన్ రెండూ చేయగల సత్తా ఉన్నందున అతనికి ఇంత ధర పలికింది.

గమనిక : ఇది కేవలం స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ నిర్వహించిన అంచనా వేలం మాత్రమే. ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్‌లో అసలు ధరలు, టీమ్ కొనుగోలు నిర్ణయాలు వేరేలా ఉండవచ్చు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..