IPL Mega Auction 2022: అన్‌సోల్డ్ లిస్టులో చేరేది వీరేనా.. జాబితాలో ముగ్గురు టీమిండియా ప్లేయర్లు?

|

Feb 04, 2022 | 12:15 PM

మెగా వేలంలో పాల్గొన్న 590 మంది ఆటగాళ్ల జాబితాను మంగళవారం బీసీసీఐ విడుదల చేసింది. ఇందులో 355 అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు, 228 క్యాప్డ్ ప్లేయర్‌లు ఉన్నారు. అయితే కొందరు వేలంలో ఉన్నా.. కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపడం లేదు.

IPL Mega Auction 2022: అన్‌సోల్డ్ లిస్టులో చేరేది వీరేనా.. జాబితాలో ముగ్గురు టీమిండియా ప్లేయర్లు?
Ipl 2022
Follow us on

IPL Mega Auction 2022: ఐపీఎల్ 2022కి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. మెగా వేలంలో పాల్గొన్న 590 మంది ఆటగాళ్ల జాబితాను మంగళవారం బీసీసీఐ(BCCI) విడుదల చేసింది. ఇందులో 355 అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు, 228 క్యాప్డ్ ప్లేయర్‌లు ఉన్నారు. అయితే కొందరు వేలం(IPL 2022)లో ఉన్నా.. కొనుగోలు చేసేందుకు(IPL 2022 Unsold List) ఫ్రాంచైజీలు ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి లిస్టులో కొందరు ఉన్నారు. వారిలో 5గురు ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. చెతేశ్వర్ పుజారా: ఈ జాబితాలో చెతేశ్వర్ పుజారా తొలి స్థానంలో నిలిచాడు. ఈ భారత అనుభవజ్ఞుడు మెగా వేలం కోసం తన పేరును రూ. 50 లక్షల బేస్ ధరతో ఉంచాడు. అయితే ఈసారి పుజారాను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపడం లేదు. అతని పేలవమైన ఫామ్, టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా ఉండటం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. గత ఏడాది ఐపీఎల్ 2021 వేలంలో పుజారాను చెన్నై సూపర్ కింగ్స్ అతని బేస్ ధర రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. CSKలో చేరడంతో పాటు, పుజారాకు పూర్తి ఏడేళ్ల తర్వాత IPL కాంట్రాక్ట్ లభించింది. దక్షిణాఫ్రికా టూర్‌లో కూడా పుజారా పరుగుల కోసం కష్టపడ్డాడు.

2. ఇషాంత్ శర్మ: ఈ జాబితాలో రెండో పేరు ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మకు దక్కింది. ఇషాంత్ గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కానీ, ఈసారి జట్టు అతన్ని రిటైన్ చేసుకోలేదు. మెగా వేలం కోసం ఇషాంత్ తన బేస్ ధరను రూ. 1.50 కోట్లుగా ఉంచుకున్నాడు. ఇటీవలి కాలంలో అతని ప్రదర్శన చాలా పేలవంగా తయారైంది. ఆఫ్రికా టూర్‌లో ఇషాంత్‌కు ఒక్క టెస్టు మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు. గత రెండు ఐపీఎల్ సీజన్‌ల గురించి మాట్లాడితే, ఫిట్‌నెస్ సరిగా లేకపోవడంతోపాటు ఇషాంత్ కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. ఇషాంత్ ఖాతాలో కేవలం 1 వికెట్ మాత్రమే వచ్చింది. 2019 ఐపీఎల్‌లో ఇషాంత్ 13 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు మాత్రమే తీశాడు. ఇంత ఎక్కువ బేస్ ధర కారణంగా ఇషాంత్‌కు ఈ సీజన్‌లో షాక్ తగలనుందని అంటున్నారు.

3. కేదార్ జాదవ్: భారత వన్డే, టీ20 జట్టు నుంచి దూరమైన కేదార్ జాదవ్.. ఐపీఎల్ గత కొన్ని సీజన్లలోనూ ప్రత్యేకంగా ఏలాంటి మాయ చేయలేకపోయాడు. ఐపీఎల్ 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున కేదార్ బరిలోకి దిగాడు. అయితే ఈసారి అతన్ని జట్టు విడుదల చేసింది. మెగా వేలం కోసం జాదవ్ తన పేరును రూ. 1 కోటి ప్రాథమిక ధరలో ఉంచాడు. అధిక బేస్ ధర, పేలవమైన ఫిట్‌నెస్, పేలవమైన ఫామ్ ఆధారంగా, ఈసారి అతనిపై ఏ జట్టు కూడా ఆసక్తి చూపదని అంటున్నారు. గత రెండు ఐసీఎల్ సీజన్లలో, కేదార్ జాదవ్ 10 ఇన్నింగ్స్‌లలో 16.71 సగటుతో 117 పరుగులు మాత్రమే చేశాడు. జాదవ్ చాలా కాలంగా దేశవాళీ క్రికెట్‌లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేదు.

4. ఇమ్రాన్ తాహిర్: ఈ జాబితాలో ఇమ్రాన్ తాహిర్ తదుపరి పేరుగా కావొచ్చు. గతేడాది టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో తాహిర్ ఓ సభ్యుడిగా ఉన్నాడ. అయితే ఈసారి ఆ జట్టు అతనికి వేలానికి దారి చూపించింది.ఈ ఆఫ్రికన్ మాజీ స్పిన్నర్ వేలం కోసం తన బేస్ ధర రూ. 20 మిలియన్లకు ఉంచాడు. అధిక బేస్ ధర, వృద్ధాప్యం, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ కారణంగా, అతను ఈసారి మెగా వేలంలో ఒంటరిగా మిగిలిపోనున్నట్లు భావిస్తున్నారు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో ఇమ్రాన్ కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడే అవకాశం లభించింది. తాహిర్‌కు 42 ఏళ్లు వచ్చాయి. దాని ప్రభావం అతని ఫిట్‌నెస్‌పై కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

5. ఆరోన్ ఫించ్: ఈ జాబితాలో చివరి పేరు ఆస్ట్రేలియా కెప్టెన్, ఓపెనర్ ఆరోన్ ఫించ్ నుంచి వచ్చింది. మెగా వేలంలో టేకర్లను కనుగొనని అతికొద్ది మంది ఆటగాళ్లలో ఫించ్ కూడా ఒకడు కావచ్చు. ఈసారి వేలం కోసం, ఫించ్ తన ప్రాథమిక ధర రూ. 2 కోట్లతో ఉంచాడు. గత ఏడాది వేలంలో కూడా ఫించ్ బేస్ ప్రైజ్ రూ. 1.5 కోట్లుగా ఉంది. ఫించ్‌ను తీసుకోవడానికి ఏ జట్టు ముందుకు రాలేదు. ఈసారి కూడా అతను అమ్ముడయ్యే అవకాశం ఉండదని అంటున్నారు. ఐపీఎల్‌లో ఫించ్ ప్రదర్శన కూడా ప్రత్యేకంగా లేదు. 6 ఫ్రాంచైజీల తరుపున ఆడిన ఈ ఆస్ట్రేలియా ఓపెనర్ 87 మ్యాచ్‌ల్లో 25.38 సగటుతో మొత్తం 2005 పరుగులు మాత్రమే చేశాడు.

Also Read: Friday Fights: ఆస్ట్రేలియాలో ఇద్దరు టీమిండియా ఆటగాళ్ల మధ్య గొడవ.. షమీ అడ్డుకోకుంటే నానా రచ్చ అయ్యేదే..!

ICC U 19 World Cup: ఫైనల్లో ఇలా ఆడితే.. విజయం మీ సొంతం: కుర్రాళ్లకు విరాట్ కోహ్లీ కీలక సూచనలు