MI vs LSG IPL Match Result: ఐపీఎల్ 2022 (IPL 2022)లో ఇప్పటి వరకు ఖాతా తెరవని ముంబైకి మరో పరాజయం ఎదురైంది. పాయింట్ల జాబితాలో చివరి స్థానంలో ఉన్న ముంబై లక్నోతో జరిగిన మ్యాచ్‌లోనైనా విజయాన్ని సాధించాలనే ఆశ నిరాశే అయ్యింది. లక్నో సూపర్ జెయింట్స్ ఇచ్చిన 200 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో చివరి వరకు పోరాడి ఓడింది. చివరి క్షణాల్లో పోలార్డ్, జయదేవ్ ఉనద్కత్ దూకుడు మీద ఆడినా విజయాన్ని మాత్రం అందుకోలేక పోయారు. నిర్ణీత 20 ఓవర్లలో పరుగులు చేసిన పరాజయం పొందింది. చివరి ఓవర్‌లో విజయానికి 26 పరుగులు కావాల్సి ఉండగా కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 18 పరుగుల తేడాతో లక్నో చేతిలో ఓటమై పాలైంది. ఇలా ముంబై తన ఖాతాలో ఒక్క విజయాన్ని కూడా వేసుకోలేకపోయింది.
ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ విషయానికొస్తే సూర్యకుమార్ యాదవ్ చేసిన 37 పరుగులే అత్యధికం. తర్వాత డెవాల్డ్ బ్రెవిస్ 31,తిలక్ వర్మ 26, పొలార్డ్ 25 పరుగులు చేశారు. ఇక ముంబై బౌలర్ల విషయానికొస్తే అవేశ్ ఖాన్ 4 ఓవర్లు వేసి కేవలం 30 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. హోల్డర్, దుష్మంత చమీరా, రవి భిష్ణోయ్, మార్కస్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన లక్నో టీమ్ దూకుడుగా ఆడింది. బ్యాట్స్‌మెన్ రాణించడంతో ముంబై ముందు 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ముఖ్యంగా రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణించి జట్టు స్కోరును భారీగా పెంచేశాడు. కేవలం 57 బంతుల్లోనే 100 పరుగులు పూర్తి చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇలా లక్నో తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకుంది.