IPL Unluckiest Players: ఐపీఎల్ హిస్టరీలోనే బ్యాడ్‌లక్ ప్లేయర్స్.. ఈ మ్యాటర్ తెలిస్తే పాపం అనాల్సిందే..!

IPL Unluckiest Players: ఈ స్టార్ ఆటగాళ్లు వ్యక్తిగత రికార్డుల పరంగా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, జట్టును ట్రోఫీ విజేతగా నిలపడంలో ఎదురవుతున్న అడ్డంకులు వారిని ఐపీఎల్ చరిత్రలో అత్యంత దురదృష్టవంతులుగా మారుస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్ అయినా వీరి నిరీక్షణకు తెరదించుతుందో లేదో చూడాలి.

IPL Unluckiest Players: ఐపీఎల్ హిస్టరీలోనే బ్యాడ్‌లక్ ప్లేయర్స్.. ఈ మ్యాటర్ తెలిస్తే పాపం అనాల్సిందే..!
Ipl Unluckiest Players

Updated on: Mar 28, 2026 | 4:56 PM

IPL Unluckiest Players: ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ లీగ్ ఐపీఎల్‌లో ఎందరో ఆటగాళ్లు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. కానీ, వ్యక్తిగతంగా ఎంతో మంది దిగ్గజాలు పరుగుల వరద పారించినా, ఇప్పటికీ ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడలేకపోయారు. కోట్లాది రూపాయల పారితోషికం తీసుకుంటున్నప్పటికీ, విజేతగా నిలవలేకపోయిన ఆ ‘దురదృష్టవంతులైన’ ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఏబీ డివిలియర్స్.. పాపం అనాల్సిందే..

ఐపీఎల్ చరిత్రలో ఏబీ డివిలియర్స్ ఓ సంచలనం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆయన అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. తన కెరీర్‌లో 5,162 పరుగులు సాధించిన ఈ దక్షిణాఫ్రికా దిగ్గజం, జట్టును ఫైనల్‌కు, ప్లేఆఫ్స్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ, తన సుదీర్ఘ కెరీర్‌లో ఒక్కసారి కూడా ట్రోఫీని ఎత్తలేకపోయాడు. అదేవిధంగా ‘యూనివర్స్ బాస్’ క్రిస్ గేల్ సైతం 142 మ్యాచ్‌ల్లో 4,965 పరుగులు చేసినా, 175 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడినా టైటిల్ సాధించలేకపోయాడు.

రిషబ్ పంత్: భారీ జీతం.. కానీ అందని విజయం

2026 సీజన్ విషయానికి వస్తే, కొందరు ఆటగాళ్ల జీతాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా లక్నో సూపర్ జెయింట్స్ సారథి రిషబ్ పంత్ 27 కోట్ల రూపాయల రికార్డు స్థాయి జీతంతో ఐపీఎల్‌లో అత్యధిక పారితోషికం పొందుతున్న ఆటగాడిగా నిలిచాడు. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఫైనల్ చేరినా, ముంబై చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇప్పటివరకు 125 మ్యాచ్‌ల్లో 3,553 పరుగులు చేసిన పంత్, ఈసారి లక్నో తరఫున తన కల నెరవేర్చుకోవాలని చూస్తున్నాడు.

నిలకడ ఉన్నా కేఎల్ రాహుల్‌కు కలిసిరాని అదృష్టం..

కె.ఎల్. రాహుల్ ఐపీఎల్‌లో అత్యంత నిలకడైన ఆటగాడు. ఏడు సీజన్లలో 500కు పైగా పరుగులు సాధించి, మొత్తం 5,222 పరుగులు చేసినా ఆయనకు లీగ్ టైటిల్ దక్కలేదు. పంజాబ్, లక్నో జట్లకు నాయకత్వం వహించినా ఫలితం దక్కలేదు. మరోవైపు సంజూ శామ్సన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 4,704 పరుగులు చేసిన సంజూ, రాజస్థాన్ రాయల్స్ నుంచి 18 కోట్ల రూపాయలకు చెన్నై సూపర్ కింగ్స్‌కు మారాడు. ఈ ఇద్దరు ఆటగాళ్ల ఉమ్మడి పారితోషికం 45 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us