IPL History: ఐపీఎల్‌లో అత్యధిక పారితోషికం అందుకున్న ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం పదండి..
ఐపీఎల్ వేలం వచ్చిదంటే చాలు.. తమకు ఇష్టమైన ఆటగాటు ఎంత ప్రైజ్ పలుకుతుంది. ఏ ఫ్రాంచైజీ అతడిని దక్కించుకుంటుంది. ఏ ఆటగాడు ఎక్కువ ధర పలుకుతాడు? మొదలైన అంశాలపై క్రికెట్ ప్రేమికులకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది.
IPL History: ఐపీఎల్ వేలం వచ్చిదంటే చాలు.. తమకు ఇష్టమైన ఆటగాటు ఎంత ప్రైజ్ పలుకుతుంది. ఏ ఫ్రాంచైజీ అతడిని దక్కించుకుంటుంది. ఏ ఆటగాడు ఎక్కువ ధర పలుకుతాడు? మొదలైన అంశాలపై క్రికెట్ ప్రేమికులకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫిబ్రవరి 18న 13వ సీజన్ కోసం వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రతి సీజన్‌లో ఎక్కువ ధర పలికిన ప్లేయర్స్‌పై ఓ లుక్కేద్దాం పదండి.
>ఐపీఎల్ ఫస్ట్ సీజన్‌లో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అత్యధిక ధర పలికాడు. 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా టీమ్‌ను విజేతగా నిలిపిన ధోనీ నాయకత్వం పట్ల ఫ్రాంచైజీలు ఎక్కువ నమ్మకాన్ని ప్రదర్శించాయి. దీంతో అతడికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ కారణంగా జార్కండ్ డైనమేట్‌ను 9.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం. అప్పటి నుంచి చెన్నైకే ఆడుతున్న ధోనీ చెన్నైను మూడు సార్లు విజేతగా నిలిపాడు.
తర్వాత ఏడాది (2009) జరిగిన వేలంలో ఇంగ్లాండ్ ప్లేయర్స్ కెవిన్ పీటర్సన్ (9.8 కోట్లు-ఆర్సీబీ), ఆండ్రూ ఫ్లింటాఫ్(9.8 కోట్లు -చెన్నై) ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించారు. 2010లో వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ ( ముంబై-3.5 కోట్లు), న్యూజిలాండ్ పేసర్ షేన్ బాండ్ (కేకేఆర్-3.5 కోట్లు) భారీ ధర పలికారు. అనంతరం 2011 ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్.. గౌతమ్ గంభీర్‌ను 11.4 కోట్లకు కొనుగోలు చేసి.. ఆశ్యర్యపరిచింది. ఇక తర్వాత యువరాజ్ సింగ్ (రెండుసార్లు 2014 ఆర్సీబీ 14 కోట్లు….2015 ఢిల్లీ 16 కోట్లు), బెన్ స్టోక్స్ (రెండు సార్లు 2017 పూణె-14.5 కోట్లు… 2018 రాజస్థాన్ 12.5 కోట్లు), రవీంద్ర జడేజా , జయదేవ్ ఉనద్కత్ వరుస సీజన్లలో అధిక ధరకు అమ్ముడుపోయారు. గత సీజన్‌లో ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్‌ను (15.5 కోట్లు) అత్యధిక ధరకు కొనుగోలు చేసింది కోల్‌కతా నైట్‌రైడర్స్.
Also Read: