IPL Auction 2026 : ఎవర్రా ఈ కుర్రాడు.. రూ. 30 లక్షలతో వేలంలోకి వచ్చి.. ఏకంగా కోట్లు పట్టుకెళ్లాడుగా

IPL Auction 2026 : దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ ఒక యంగ్ అన్‌క్యాప్డ్ ఆటగాడికి అద్భుతమైన మలుపు ఇచ్చింది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ ఔకిబ్ దార్ కేవలం రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చాడు. అతన్ని కొనుగోలు చేయడానికి ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య తీవ్రమైన పోటీ జరిగింది.

IPL Auction 2026 : ఎవర్రా ఈ కుర్రాడు.. రూ. 30 లక్షలతో వేలంలోకి వచ్చి.. ఏకంగా కోట్లు పట్టుకెళ్లాడుగా
Auqib Dar

Updated on: Dec 16, 2025 | 5:02 PM

IPL Auction 2026 : దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ ఒక యంగ్ అన్‌క్యాప్డ్ ఆటగాడికి అద్భుతమైన మలుపు ఇచ్చింది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ ఔకిబ్ దార్ కేవలం రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చాడు. అతన్ని కొనుగోలు చేయడానికి ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య తీవ్రమైన పోటీ జరిగింది. అనూహ్యంగా ఆ బిడ్డింగ్ వార్ చివరకు రూ.8.40 కోట్ల భారీ ధర వద్ద ఆగింది. ఔకిబ్ దార్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఇది అతని బేస్ ప్రైస్ కంటే ఏకంగా 28 రెట్లు ఎక్కువ కావడం విశేషం.

ఈ భారీ ధరతో ఔకిబ్ దార్ ఈ సీజన్‌లో అమ్ముడైన భారతీయ ఆటగాళ్లలో అత్యంత ఖరీదైన ఆటవాడిగా నిలిచాడు. ఇతని ధర సీనియర్ ఆటగాళ్లైన వెంకటేష్ అయ్యర్ (రూ.7 కోట్లు), రవి బిష్ణోయ్ (రూ.7.20 కోట్లు) కంటే కూడా ఎక్కువ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఔకిబ్ దార్‌ (ఇతని పూర్తి పేరు ఔకిబ్ నబీ దార్) 28 ఏళ్ల జమ్మూ కశ్మీర్‌కు చెందిన రైట్ ఆర్మ్ మీడియం పేసర్. దేశవాళీ క్రికెట్‌లో అతని నిలకడైన ప్రదర్శన ఈ భారీ ధరకు కారణమైంది.

కొత్త బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల అతని సామర్థ్యం ఫ్రాంచైజీలను ఆకర్షించింది. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025/26లో 7 మ్యాచుల్లో కేవలం 7.41 ఎకానమీ రేటుతో 15 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 36 మ్యాచుల్లో 125 వికెట్లు తీశాడు. 2024-25 రంజీ సీజన్‌లో 44 వికెట్లు తీసి, దేశంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. దులీప్ ట్రోఫీలో కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. గతంలో అతను కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు నెట్ బౌలర్‌గా కూడా పనిచేశాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, ఈ వేలంలో వ్యూహాత్మకంగా కొనుగోళ్లు చేస్తోంది. ఔకిబ్ దార్ కోసం RR, SRH లను ఎదురించి రూ.8.40 కోట్లు ఖర్చు చేయడం ద్వారా, ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఇండియన్ పేస్ బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమైంది. ఔకిబ్ దార్ తన స్వింగ్, డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయగల సామర్థ్యంతో, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఒక కీలకమైన అన్‌క్యాప్డ్ ఇండియన్ పేస్ ఆప్షన్‌గా మారనున్నాడు.

కేవలం రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో ఆరంభించి, అనూహ్యంగా రూ.8.40 కోట్లు పలికిన ఔకిబ్ దార్ ప్రయాణం.. రాత్రికి రాత్రే ఒక యువ క్రికెటర్ తలరాతను ఎలా మారుస్తుందో ఐపీఎల్ ఆక్షన్ మరోసారి నిరూపించింది. అతనిపై ఢిల్లీ క్యాపిటల్స్ ఉంచిన భారీ నమ్మకానికి తగిన విధంగా ఐపీఎల్ 2026లో రాణించడం ఇప్పుడు ఔకిబ్ దార్ ముందున్న సవాలు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..