
IPL 2024, Shardul Thakur: 2018, 2021లో చెన్నై సూపర్ కింగ్స్‌తో రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన శార్దుల్ ఠాకూర్.. చివరిసారిగా కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడాడు. గతేడాది వేలంలో రూ.10.75 కోట్లకు కేకేఆర్ టీం దక్కించుకుంది. ఠాకూర్ 2023లో 11 మ్యాచ్‌లు ఆడాడు. 113 పరుగులు చేసి ఏడు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు.
KKR, CSK కాకుండా, ఠాకూర్ ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తరపున కూడా ఆడాడు. ఐపీఎల్‌లో 86 మ్యాచ్‌లు ఆడిన ఠాకూర్ 286 పరుగులు చేసి 28.76 సగటుతో 89 వికెట్లు పడగొట్టాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్, సీఎస్‌కేతో బిడ్డింగ్ పోరులో డిఫెండింగ్ IPL ఛాంపియన్ చివరికి తన ఖాతాలో వేసుకుంది.
Rutu and the Superfans Wish! ✅ pic.twitter.com/P8hVi87rcT
— Chennai Super Kings (@ChennaiIPL) December 19, 2023
2023 IPLలో నిరాశపరిచినప్పటికీ, ఠాకూర్ గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 29 బంతుల్లో 68 పరుగులతో తన కెరీర్-బెస్ట్ IPL స్కోరును సాధించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..