IPL 2027: కేకేఆర్ కెప్టెన్‌గా అతనే బెస్ట్..? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

KKR Captain 2027: ఐపీఎల్ 2027లో కోల్‌కతా నైట్ రైడర్స్ కొత్త కెప్టెన్ ఎవరనే చర్చ మొదలైంది. అజింక్య రహానే రిటైర్మెంట్‌తో కెప్టెన్సీ ఖాళీ కాగా, రింకూ సింగ్‌ను ఆ బాధ్యతలకు ఎంపిక చేయాలని టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. శై హోప్ పేరు కూడా ప్రస్తావించాడు.

IPL 2027: కేకేఆర్ కెప్టెన్‌గా అతనే బెస్ట్..? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
Kkr Retention List

Updated on: Nov 29, 2026 | 12:30 PM

KKR Captain 2027: ఐపీఎల్ 2027 సీజన్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్ ఎవరు అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే 10 జట్లలో 9 జట్లు తమ కెప్టెన్లను ఖరారు చేసినప్పటికీ, మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన కేకేఆర్ మాత్రం కొత్త కెప్టెన్ విషయంలో ఇంకా నిర్ణయం ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తన కెప్టెన్సీ ఎంపికను వెల్లడించాడు. కేకేఆర్ పగ్గాలు రింకూ సింగ్‌కు అప్పగించాలని సూచించాడు.

KKR కెప్టెన్సీకి రింకూ సింగ్ సరైన ఎంపిక?

గత రెండు ఐపీఎల్ సీజన్లలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అనుభవజ్ఞుడైన అజింక్య రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే జులైలో రహానే భారత క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించడంతో కేకేఆర్ కొత్త కెప్టెన్ కోసం అన్వేషిస్తోంది.

ఎక్కువమంది చదివినది: IND vs NZ: 91 బంతుల్లో 12 పరుగులు.. టెస్టు క్రికెట్‌ హిస్టరీలో చెత్త రికార్డులో టీమిండియా జోడీ..!

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలో కేకేఆర్‌కు కొత్త కెప్టెన్‌గా రింకూ సింగ్‌ను ఎంపిక చేయాలని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. రింకూ ప్రస్తుతం జట్టులో వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. జట్టుతో అతనికి చాలా కాలంగా అనుబంధం ఉండటం కూడా కెప్టెన్సీకి అనుకూల అంశంగా భావిస్తున్నాడు.

రింకూ సింగ్‌కే ఇర్ఫాన్ పఠాన్ మద్దతు..

JioStar నిర్వహించిన ‘TATA IPL 2027 Retention Special’ కార్యక్రమంలో మాట్లాడిన ఇర్ఫాన్ పఠాన్.. కేకేఆర్ జట్టులో ప్రస్తుతం కెప్టెన్సీ కోసం ఎక్కువ అవకాశాలు లేవని పేర్కొన్నాడు. రింకూ సింగ్ ఈ బాధ్యతలు చేపట్టేందుకు అత్యుత్తమ ఎంపికగా కనిపిస్తున్నాడని అభిప్రాయపడ్డాడు.

“కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా రింకూ సింగ్‌ను నియమించాలనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జట్టులో కెప్టెన్సీ కోసం ఎక్కువ ఎంపికలు లేవు. రింకూ అత్యుత్తమ ఎంపికగా కనిపిస్తున్నాడు.”

ఎక్కువమంది చదివినది: శ్రీలంక సిరీస్‌కు భారత జట్టు.. సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం..!

2018లో కేకేఆర్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన రింకూ సింగ్ అప్పటి నుంచి అదే ఫ్రాంచైజీతో కొనసాగుతున్నాడు. రాబోయే సీజన్ కోసం కూడా కేకేఆర్ అతడిని రిటైన్ చేసుకుంది. జట్టుతో అతడికి ఉన్న దీర్ఘకాలిక అనుబంధం కెప్టెన్సీ రేసులో కీలకంగా మారవచ్చు.

షాయ్ హోప్ కూడా కెప్టెన్సీకి మంచి ఎంపిక..

ఒకవేళ కేకేఆర్ వేలం ద్వారా కొత్త కెప్టెన్‌ను తీసుకోవాలని భావిస్తే వెస్టిండీస్ ఆటగాడు షాయ్ హోప్ కూడా మంచి ఎంపిక అవుతాడని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. ఇటీవల భారత్‌లో జరిగిన సిరీస్‌లో హోప్ మంచి ప్రదర్శన చేశాడని, అతడిని కెప్టెన్సీ కోసం పరిశీలించవచ్చని తెలిపాడు.

అయితే కేకేఆర్ మేనేజ్‌మెంట్ విధానాన్ని చూస్తుంటే రింకూ సింగ్‌నే కొత్త కెప్టెన్‌గా నియమించే అవకాశం ఎక్కువగా ఉందని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు. దీంతో ఐపీఎల్ 2027లో కేకేఆర్ కెప్టెన్సీ రేసుపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us