IPL Records : ఐపీఎల్‌లో సిక్సర్ల సునామీ.. ఈసారి ‘యూనివర్స్ బాస్’ క్రిస్ గేల్ రికార్డు గల్లంతేనా?

IPL Records : ఐపీఎల్ 2026లో సిక్సర్ల రికార్డు బద్దలయ్యేలా ఉంది. గతేడాది 1294 సిక్సర్లు నమోదు కాగా, 13 ఏళ్లుగా క్రిస్ గేల్ పేరిట ఉన్న 59 సిక్సర్ల రికార్డును ఎవరైనా తుడిచి పెడతారేమో చూడాలి. అందరి దృష్టి వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ మీదే ఉంది.

IPL Records : ఐపీఎల్‌లో సిక్సర్ల సునామీ.. ఈసారి  యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ రికార్డు గల్లంతేనా?
Chris Gayle

Updated on: Mar 19, 2026 | 7:29 AM

IPL Records : ఐపీఎల్ అంటేనే ఫోర్లు, సిక్సర్ల వర్షం. ప్రతి సీజన్‌లోనూ బ్యాటర్లు బంతిని బౌండరీ అవతలకు పంపిస్తూ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తుంటారు. అయితే ఈసారి ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న వేళ అందరి దృష్టి సిక్సర్ల రికార్డులపైనే ఉంది. గత కొన్ని ఏళ్లుగా సిక్సర్ల సంఖ్య ఏ రేంజ్ లో పెరుగుతుందో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఐపీఎల్ ప్రతి సీజన్‌లోనూ సిక్సర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. 2021లో కేవలం 687 సిక్సర్లు మాత్రమే నమోదు కాగా, 2022లో కొత్తగా రెండు జట్లు రావడంతో మ్యాచ్‌ల సంఖ్య పెరిగి సిక్సర్లు ఏకంగా 1062కు చేరాయి. 2023లో ఆ సంఖ్య 1124కు చేరుకోగా, గత సీజన్‌లో అంటే 2024-25 సమయంలో బ్యాటర్ల హవా పీక్ స్టేజ్‌కు చేరింది. ఏకంగా 1294 సిక్సర్లు బాదేశారు. ఈ ఏడాది ఆ సంఖ్య 1300 దాటడం పక్కా అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల బ్యాటర్లు భయం లేకుండా ఆడుతుండటమే దీనికి ప్రధాన కారణం.

13 ఏళ్లుగా చెక్కు చెదరని గేల్ రికార్డు

మొత్తం సీజన్‌లో సిక్సర్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, వ్యక్తిగతంగా ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు మాత్రం ఇప్పటికీ ‘యూనివర్స్ బాస్’ క్రిస్ గేల్ పేరునే ఉంది. 2012లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన గేల్, కేవలం 15 మ్యాచ్‌ల్లోనే 59 సిక్సర్లు బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ రికార్డు క్రియేట్ అయి 13 ఏళ్లు గడుస్తున్నా, ఇప్పటివరకు ఏ బ్యాటర్ కూడా ఆ మార్కును అందుకోలేకపోయారు. బట్లర్, రసెల్ వంటి వారు ప్రయత్నించినప్పటికీ గేల్ రికార్డు మాత్రం పదిలంగా ఉంది.

అభిషేక్ శర్మ బాదేస్తాడా ?

భారత బ్యాటర్ల విషయానికి వస్తే, యువ సంచలనం అభిషేక్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతూ కేవలం 16 మ్యాచ్‌ల్లో 42 సిక్సర్లు బాదాడు. ఒకే సీజన్‌లో 40కి పైగా సిక్సర్లు కొట్టిన ఏకైక ఇండియన్ బ్యాటర్‌గా అభిషేక్ చరిత్రకెక్కాడు. గతంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలకు కూడా సాధ్యం కాని ఈ ఫీట్‌ను అభిషేక్ తన పవర్‌ఫుల్ హిట్టింగ్‌తో సాధించి చూపించాడు. ఈసారి కూడా మన కుర్రాళ్లు గేల్ రికార్డుపై కన్నేస్తారేమో చూడాలి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us