IPL 2026 : ఐపీఎల్ 2026 రిటెన్షన్ గడువు నేడే.. క్లాసెన్‌ను అట్టిపెట్టుకున్న SRH, మాక్స్‌వెల్‌ను వదిలేసిన PBKS?

ఐపీఎల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 రిటెన్షన్ లిస్ట్‌ను ప్రకటించే గడువు నేటితో (నవంబర్ 15, సాయంత్రం 5 గంటల వరకు) ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏఏ ఆటగాళ్లు ఆయా జట్లలో ఉండబోతున్నారు, ఎవరిని రిలీజ్ చేయబోతున్నారనే దానిపై కీలక సమాచారం బయటకు వచ్చింది.

IPL 2026 : ఐపీఎల్ 2026 రిటెన్షన్ గడువు నేడే.. క్లాసెన్‌ను అట్టిపెట్టుకున్న SRH, మాక్స్‌వెల్‌ను వదిలేసిన PBKS?
Ipl 2026

Updated on: Nov 15, 2025 | 6:23 AM

IPL 2026 : ఐపీఎల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 రిటెన్షన్ లిస్ట్‌ను ప్రకటించే గడువు నేటితో (నవంబర్ 15, సాయంత్రం 5 గంటల వరకు) ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏఏ ఆటగాళ్లు ఆయా జట్లలో ఉండబోతున్నారు, ఎవరిని రిలీజ్ చేయబోతున్నారనే దానిపై కీలక సమాచారం బయటకు వచ్చింది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ (PBKS) ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్‌ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మాత్రం హెన్రిక్ క్లాసెన్‌ను అట్టిపెట్టుకోనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్సీపైనా బిగ్ అప్‌డేట్ వచ్చింది.

ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్ లిస్ట్‌ను జట్లు నేటి (నవంబర్ 15) సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాల్సి ఉంది. ఈ కీలక సమయంలో పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టు ఆస్ట్రేలియా సీనియర్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను రిలీజ్ చేయాలని దాదాపు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో మాక్స్‌వెల్ 7 మ్యాచ్‌లలో కేవలం 48 పరుగులు మాత్రమే చేయడంతో, అతన్ని వదులుకోవడానికి పంజాబ్ సిద్ధమైంది. అతని స్థానంలో వచ్చిన మిచెల్ ఓవెన్‌కు కూడా రిటెన్షన్ దక్కే అవకాశం తక్కువేనని సమాచారం.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు విషయానికి వస్తే, సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ హెన్రిక్ క్లాసెన్‌ను రిలీజ్ చేసే ఆలోచన లేదని క్రిక్‌బజ్ నివేదిక తెలిపింది. మెగా ఆక్షన్‌లో రూ.23 కోట్లకు కొనుగోలు చేసిన క్లాసెన్, గత సీజన్‌లో 14 మ్యాచ్‌లలో 487 పరుగులు చేసి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇక ఇతర జట్ల నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) లియామ్ లివింగ్‌స్టోన్, రసిఖ్ దార్ సలామ్, మయాంక్ అగర్వాల్‌ను, ముంబై ఇండియన్స్ (MI) విల్ జాక్స్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్సీ విషయంలోనూ క్లారిటీ వచ్చింది. గత సీజన్‌లో జట్టును నడిపించిన అజింక్య రహానేనే ఐపీఎల్ 2026 లోనూ కెప్టెన్‌గా కొనసాగే అవకాశం ఉంది. వాస్తవానికి KKR టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉన్న కేఎల్ రాహుల్‌ను ట్రేడ్ ద్వారా తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నించింది. ఒకవేళ ఆ డీల్ పూర్తయి ఉంటే, కచ్చితంగా రాహుల్‌కు కెప్టెన్సీ దక్కేది. అయితే ఆ ట్రేడ్ డీల్ ఫెయిల్ కావడంతో, ప్రస్తుతానికి రహానే కెప్టెన్‌గా కొనసాగనున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..