RCB ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్..! ప్లేయింగ్ 11లో ఆ బలహీనతలు.. దెబ్బ గట్టిగానే తగిలిందిగా?

ఐపీఎల్ 2026 సీజన్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్ధమవుతోంది. అయితే, సీజన్ ప్రారంభానికి ముందే ఆర్సీబీకి మూడు భారీ షాకులు తగిలాయి. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో కీలక ఆటగాళ్లు దూరం కావడం జట్టును కలవరపెడుతోంది. మరి విరాట్ కోహ్లీ సేన ఈసారి కప్పు కొడుతుందా? లేదా అనేది ఓసారి చూద్దాం..

RCB ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్..! ప్లేయింగ్ 11లో ఆ బలహీనతలు.. దెబ్బ గట్టిగానే తగిలిందిగా?
Rcb Playing 11

Updated on: Mar 23, 2026 | 11:57 AM

ఐపీఎల్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB). డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న ఆర్సీబీ, ఈసారి కూడా టైటిల్ నిలుపుకోవాలని పట్టుదలతో ఉంది. అయితే, ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే జట్టులో కొన్ని ఆందోళనకర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

జట్టుకు వెన్నెముకలా నిలిచిన బ్యాటింగ్ విభాగం..

ఆర్సీబీకి ఉన్న అతిపెద్ద బలం ఆ జట్టు బ్యాటింగ్ డెప్త్. ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ విద్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. మిడిల్ ఆర్డర్‌లో రజత్ పాటీదార్, దేవదత్ పడిక్కల్, వెంకటేష్ అయ్యర్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండటం జట్టుకు కొండంత అండ. జితేష్ శర్మ రూపంలో పటిష్టమైన వికెట్ కీపర్ ఫినిషర్ అందుబాటులో ఉండగా, టీమ్ డేవిడ్, రోమారియో షెఫర్డ్ వంటి పవర్ హిట్టర్లు లోయర్ ఆర్డర్‌లో మెరుపులు మెరిపించగలరు.

బౌలింగ్ విభాగంలో భారీ ఎదురుదెబ్బలు..

బ్యాటింగ్ పరంగా పటిష్టంగా ఉన్నా, బౌలింగ్ విభాగంలో ఆర్సీబీకి షాకులు తగిలాయి. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ నువాన్ తుషారాకు ఎన్ఓసి (NOC) రాకపోవడంతో అతను జట్టుకు అందుబాటులో ఉండటం ఆలస్యం కావచ్చు. అలాగే, యష్ దయాల్ వ్యక్తిగత కారణాల వల్ల జట్టుకు దూరం కావడం పెద్ద లోటు. ఇప్పుడు పేస్ విభాగం మొత్తం భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ చుట్టూ తిరుగుతోంది. హేజిల్ వుడ్ కూడా ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవడం మేనేజ్మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

స్పిన్ విభాగం, ఇతర సవాళ్లు..

మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయగల వరల్డ్ క్లాస్ స్పెషలిస్ట్ స్పిన్నర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ ఉన్నప్పటికీ, వారు ఎంతవరకు ప్రభావం చూపుతారనేది ప్రశ్నార్థకం. దేశవాళీ సంచలనం మంగేష్ యాదవ్ పై భారీ ఆశలు ఉన్నా, ఐపీఎల్ ఒత్తిడిని అతను ఎలా తట్టుకుంటాడనేది వేచి చూడాలి.

మొత్తానికి ఆర్సీబీ బ్యాటింగ్ విభాగంలో “టాప్ క్లాస్” గా ఉన్నా, బౌలింగ్ పరంగా “యావరేజ్” గా కనిపిస్తోంది. ఈ బలహీనతలను అధిగమించి విరాట్ కోహ్లీ సేన మరోసారి మ్యాజిక్ చేస్తుందో లేదో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us