Cooper Connolly : ఈయన బిగ్ బాష్ లీగ్ ఆడుతున్నాడా లేక వీడియో గేమ్ ఆడుతున్నాడా? 37 బంతుల్లో 77 ఏంది సామీ ఇదీ?

Cooper Connolly : ఐపీఎల్ 2026 మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతీ జింటా వేసిన ప్లాన్ అదిరిపోయింది. వేలంలో కొన్న వెంటనే ఒక ఆటగాడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంటే పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్ కూపర్ కానోలీ బిగ్ బాష్ లీగ్‎లో విధ్వంసం సృష్టించాడు.

Cooper Connolly : ఈయన బిగ్ బాష్ లీగ్ ఆడుతున్నాడా లేక వీడియో గేమ్ ఆడుతున్నాడా? 37 బంతుల్లో 77 ఏంది సామీ ఇదీ?
Cooper Connolly

Updated on: Dec 19, 2025 | 6:32 PM

Cooper Connolly : ఐపీఎల్ 2026 మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతీ జింటా వేసిన ప్లాన్ అదిరిపోయింది. వేలంలో కొన్న వెంటనే ఒక ఆటగాడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంటే పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్ కూపర్ కానోలీ బిగ్ బాష్ లీగ్‎లో విధ్వంసం సృష్టించాడు. పంజాబ్ టీమ్ ఇతడిని రూ.3 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ నిర్ణయం సరైనదేనని కానోలీ తన బ్యాట్‌తో సమాధానం చెబుతున్నాడు.

బిగ్ బాష్ లీగ్ 2025-26లో భాగంగా పర్త్ స్కార్చర్స్, బ్రిస్బేన్ హీట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కూపర్ కానోలీ శివతాండవం చేశాడు. మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కానోలీ కేవలం 37 బంతుల్లోనే 77 పరుగులు రాబట్టాడు. ఇందులో 6 ఫోర్లు, 6 భారీ సిక్సర్లు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 208 కంటే ఎక్కువగా ఉండటం విశేషం. కానోలీ బాదిన బాదుడుకు పర్త్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. నిర్ణీత 20 ఓవర్లలో పర్త్ టీమ్ 6 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోరు సాధించింది. వేలంలో అమ్ముడైన వెంటనే ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటంతో పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ హ్యాపీగా ఉంది.

కానోలీ కేవలం ఈ మ్యాచ్‌లోనే కాదు, అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో కూడా 31 బంతుల్లో 59 పరుగులు చేసి తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేయడమే కాకుండా, అవసరమైనప్పుడు స్పిన్ బౌలింగ్‌తో వికెట్లు తీయగల సామర్థ్యం ఇతని సొంతం. ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే కొని తమ స్క్వాడ్‌ను పూర్తి చేసింది. అందులో కానోలీ ఒక కీలక ఆటగాడు. ఇప్పుడు ఇతడి ఫామ్ చూస్తుంటే ఐపీఎల్ 2026లో పంజాబ్ తరఫున మ్యాచ్ విన్నర్‌గా మారేలా కనిపిస్తున్నాడు.

మరోవైపు ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ ఫిన్ అలెన్ కూడా తన పవర్ ఏంటో చూపించాడు. ఐపీఎల్ 2026 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ ఇతడిని కొనుగోలు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన ఫిన్ అలెన్ కేవలం 38 బంతుల్లోనే 79 పరుగులు బాదాడు. ఇతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. ఫిన్ అలెన్, కానోలీ ఇద్దరూ పోటీ పడి మరి సిక్సర్ల వర్షం కురిపించడంతో స్టేడియం దద్దరిల్లిపోయింది. ఐపీఎల్ వేలంలో తమను కొన్న జట్లకు వీరు అప్పుడే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తున్నారు.

కానోలీ, ఫిన్ అలెన్ లాంటి యంగ్ ప్లేయర్స్ ఇంతటి భీభత్సాన్ని సృష్టిస్తుంటే, ఐపీఎల్ 2026 సీజన్ ఎంత రసవత్తరంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ కు కానోలీ లాంటి ఆల్‌రౌండర్ దొరకడం పెద్ద ప్లస్ పాయింట్. అలాగే కేకేఆర్ ఓపెనింగ్ సమస్యను ఫిన్ అలెన్ తీర్చేలా కనిపిస్తున్నాడు. మరి ఐపీఎల్ లో కూడా వీరు ఇదే ఫామ్ కొనసాగిస్తారో లేదో చూడాలి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..