ఒకరిద్దరు కాదు భయ్యో.. ఏకంగా ఏడుగురితో.. ఈ టీమిండియా ఆల్ రౌండర్ లిస్ట్ చూస్తే షాకే..?

Hardik Pandya Celebrity Relationships: టీమిండియా ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిరంతరం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంటాడు. తాజాగా మోడల్ మాహికా శర్మతో రిలేషన్ తో వార్తల్లో నిలిచాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఈ ఆల్ రౌండర్ ఎంతమందితో రిలేషన్ లో ఉన్నాడో ఓసారి చూద్దాం..

ఒకరిద్దరు కాదు భయ్యో.. ఏకంగా ఏడుగురితో.. ఈ టీమిండియా ఆల్ రౌండర్ లిస్ట్ చూస్తే షాకే..?
Hardik Pandya Celebrity Relationships

Updated on: Mar 24, 2026 | 11:01 AM

Hardik Pandya Celebrity Relationships: భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మైదానంలో తన మెరుపు దాడితో ప్రత్యర్థులను వణికించడమే కాదు, వ్యక్తిగత జీవితంతోనూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. నటాషా స్టాంకోవిచ్‌తో విడాకుల తర్వాత హార్దిక్ డేటింగ్ లైఫ్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గ్లామర్ ప్రపంచానికి చెందిన ఏడుగురు సుందరీమణులతో హార్దిక్ సాగించిన ప్రేమాయణాలు ఓసారి చూద్దాం..

మైదానంలో సిక్సర్లు.. మనసులో ప్రేమ అలజడి..

క్రికెట్ ప్రపంచంలో హార్దిక్ పాండ్యా ఒక ‘స్టైల్ ఐకాన్’. కేవలం ఆటతోనే కాకుండా తన వ్యక్తిత్వంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హార్దిక్, గత దశాబ్ద కాలంలో పలువురు మోడల్స్, బాలీవుడ్ హీరోయిన్లతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. నటాషాతో వైవాహిక బంధం ముగిసిన తర్వాత, ఇప్పుడు 2026లో ఆయన కొత్త రిలేషన్‌షిప్‌పై సోషల్ మీడియా ఊగిపోతోంది.

కెరీర్ ఆరంభంలో మోడల్స్‌తో దోస్తీ..

హార్దిక్ కెరీర్ తొలినాళ్లలో కోల్‌కతాకు చెందిన మోడల్ లీషా శర్మతో సన్నిహితంగా ఉండేవారు. 2016 సమయంలో వీరిద్దరి ఫోటోలు వైరల్ అయినప్పటికీ, హార్దిక్ ఆమెను కేవలం స్నేహితురాలిగానే పేర్కొన్నాడు. ఆ తర్వాత స్వీడిష్ నటి ఎల్లి అవ్రామ్, ఈషా గుప్తాలతో కూడా హార్దిక్ పేరు ముడిపడి ఉంది. ముఖ్యంగా ఎల్లి అవ్రామ్, హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్యా వివాహానికి హాజరు కావడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న పుకార్లకు బలం చేకూరింది. వీటితో పాటు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాతో కూడా హార్దిక్ లింక్-అప్ వార్తలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.

నటాషాతో పెళ్లి.. ఊహించని విడాకులు..

హార్దిక్ జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం 2019లో మొదలైంది. సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిచ్‌తో ప్రేమలో పడిన ఆయన, 2020లో సముద్రం మధ్యలో రోమాంటిక్ పద్ధతిలో ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. వీరికి అగస్త్య అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, 2024 జులైలో ఈ జంట అధికారికంగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులను షాక్‌కు గురిచేశారు. ప్రస్తుతం నటాషా తన స్వదేశానికి వెళ్లిపోగా, హార్దిక్ మళ్లీ ఒంటరివాడయ్యాడు.

2026 కొత్త మలుపు: జాస్మిన్ వాలియా నుంచి మాహికా శర్మ వరకు

విడాకుల అనంతరం బ్రిటిష్ సింగర్ జాస్మిన్ వాలియాతో హార్దిక్ గ్రీస్ పర్యటనకు వెళ్లిన ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేశాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కూడా జాస్మిన్ కనిపించింది. అయితే, ఇప్పుడు 2026 మార్చిలో కథ మరో మలుపు తిరిగింది. తాజా సమాచారం ప్రకారం, హార్దిక్ ఇప్పుడు మోడల్ మాహికా శర్మతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా మాహికా మైదానంలో హార్దిక్ పక్కనే కనిపించడం విశేషం. అంతేకాకుండా, మాహికా కోసం హార్దిక్ ఒక ప్రత్యేకమైన టాటూ కూడా వేయించుకున్నాడని, హార్దిక్ తల్లితో కూడా ఆమెకు మంచి బాండింగ్ ఉందని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో హార్దిక్ పెడుతున్న పోస్ట్‌లు చూస్తుంటే, ఆయన జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని స్పష్టమవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us