Rohit Sharma : మళ్లీ గర్జించబోతున్న హిట్‌మ్యాన్.. ఈ సీజన్లో 500+ రన్స్ కొడతాడని చెబుతున్న సౌతాఫ్రికా బౌలర్

Rohit Sharma : ఐపీఎల్ 2026 (IPL 2026) రణరంగం మొదలవబోతోంది. ఈ సీజన్‌లో అందరి కళ్లు ముంబై ఇండియన్స్ మాజీ సారథి, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మపైనే ఉన్నాయి. 38 ఏళ్ల వయసులో కూడా రోహిత్ తన ఫిట్‌నెస్‌తో, ఆటతీరుతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు.

Rohit Sharma : మళ్లీ గర్జించబోతున్న హిట్‌మ్యాన్.. ఈ సీజన్లో 500+ రన్స్ కొడతాడని చెబుతున్న సౌతాఫ్రికా బౌలర్
Rohit Sharma

Updated on: Mar 28, 2026 | 10:42 AM

Rohit Sharma : ఐపీఎల్ 2026 (IPL 2026) రణరంగం మొదలవబోతోంది. ఈ సీజన్‌లో అందరి కళ్లు ముంబై ఇండియన్స్ మాజీ సారథి, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మపైనే ఉన్నాయి. 38 ఏళ్ల వయసులో కూడా రోహిత్ తన ఫిట్‌నెస్‌తో, ఆటతీరుతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. తాజాగా సౌతాఫ్రికా దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్ (Dale Steyn) రోహిత్ శర్మ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రోహిత్ ఈసారి మునుపటి కంటే చాలా డేంజరస్‌గా ఉండబోతున్నాడని స్టెయిన్ హెచ్చరించాడు.

గత ఏడాది (2025) టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రోహిత్ శర్మ తన ఫిట్‌నెస్‌పై విపరీతమైన శ్రద్ధ పెట్టాడు. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచ కప్‌ను గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న రోహిత్, తన ఫిజిక్ పూర్తిగా మార్చుకున్నాడు. దీనిపై డేల్ స్టెయిన్ స్పందిస్తూ.. “రోహిత్ ఇప్పుడు చాలా ఫిట్‌గా కనిపిస్తున్నాడు. అతని కళ్లలో ఒక రకమైన కసి కనిపిస్తోంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో రోహిత్ గన్స్ బ్లేజింగ్ తరహాలో విరుచుకుపడతాడు. అయితే ఇది కేవలం మొరటుగా బ్యాట్ ఊపడం కాదు, పరిస్థితులకు అనుగుణంగా చాలా కంట్రోల్డ్‌గా, అగ్రెసివ్‌గా సాగుతుంది” అని ప్రశంసించాడు.

రోహిత్ ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాడు. టీ20లు, టెస్టుల నుంచి తప్పుకున్నాక తనలోని సత్తాను ప్రపంచానికి చాటిచెప్పడానికి ఐపీఎల్ ఒక గొప్ప వేదిక అని స్టెయిన్ అభిప్రాయపడ్డాడు. “విరాట్ కోహ్లీ, ఇతర సీనియర్ ప్లేయర్ల లాగే తానూ ఇంకా అత్యుత్తమ ప్లేయర్‌నే అని నిరూపించడానికి రోహిత్‌కు ఈ రెండు నెలలు చాలా కీలకం. ముఖ్యంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో క్వింటన్ డికాక్ లేదా ర్యాన్ రికిల్టన్ వంటి విధ్వంసకర ఆటగాళ్లతో కలిసి ఓపెనింగ్ చేయడం రోహిత్‌కు కలిసొచ్చే అంశం” అని స్టెయిన్ పేర్కొన్నాడు.

భారత క్రికెట్ ప్రస్తుతం అద్భుతమైన దశలో ఉందని, గెలుపు అనేది ఒక అలవాటుగా మారిందని స్టెయిన్ కొనియాడాడు. “భారత్‌లో క్రికెట్ ఎప్పుడూ ఉంటుంది, కానీ ఇప్పుడు ఒక విన్నింగ్ కల్చర్ కనిపిస్తోంది. ప్రపంచ దేశాల కంటే టీమిండియా రెండు అడుగులు ముందే ఉంది. రోహిత్ వంటి ఆటగాళ్లు ఆ సంస్కృతిని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు” అని వ్యాఖ్యానించాడు. ఆదివారం (మార్చి 29) వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగే మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్ తన వేటను మొదలుపెట్టనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ బ్యాట్ నుంచి పరుగుల వరద పారడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us