Cameron Green: రూ. 25.2 కోట్లకు అమ్ముడుపోయినా.. గ్రీన్ చేతికి వచ్చేది రూ. 18 కోట్లే.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బీసీసీఐ..?

ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ కోసం ఏకంగా రూ. 25.20 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. అయితే, ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. వేలంలో పలికన ధర రూ. 25.2 కోట్లు అయినప్పటికీ, గ్రీన్ ఖాతాలో పడేది మాత్రం కేవలం రూ. 18 కోట్లు మాత్రమే. మిగిలిన రూ. 7.2 కోట్లు అతనికి దక్కవు.

Cameron Green: రూ. 25.2 కోట్లకు అమ్ముడుపోయినా.. గ్రీన్ చేతికి వచ్చేది రూ. 18 కోట్లే.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బీసీసీఐ..?
Cameron Green

Updated on: Dec 16, 2025 | 3:16 PM

Why will Cameron Green get only Rs. 18 crore, despite being sold for Rs. 25.2 crore to KKR: ఐపీఎల్ 2026 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) సంచలనం సృష్టించింది. ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ కోసం ఏకంగా రూ. 25.20 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. అయితే, ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. వేలంలో పలికన ధర రూ. 25.2 కోట్లు అయినప్పటికీ, గ్రీన్ ఖాతాలో పడేది మాత్రం కేవలం రూ. 18 కోట్లు మాత్రమే. మిగిలిన రూ. 7.2 కోట్లు అతనికి దక్కవు.

దీనికి గల ప్రధాన కారణం బీసీసీఐ (BCCI) తీసుకొచ్చిన కొత్త నిబంధన. ఆ వివరాలు ఇవే:

ఏమిటి ఆ కొత్త రూల్? (Overseas Player Fee Cap)..

2025-27 ఐపీఎల్ సీజన్ల కోసం బీసీసీఐ ఒక కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం, “మినీ వేలంలో (Mini Auction) విదేశీ ఆటగాళ్లకు చెల్లించే ధరపై పరిమితి (Cap) ఉంటుంది.” విదేశీ ఆటగాళ్లు మెగా వేలానికి (Mega Auction) రాకుండా, తక్కువ మంది ఆటగాళ్లు ఉండే మినీ వేలంలో పాల్గొని, డిమాండ్ పెంచుకుని భారీ ధరలు పొందుతున్నారని బీసీసీఐ గుర్తించింది. దీన్ని అరికట్టడానికే ఈ రూల్ తెచ్చారు.

రూ. 18 కోట్లు అని ఎలా నిర్ణయించారు?..

ఈ రూల్ ప్రకారం, మినీ వేలంలో ఒక విదేశీ ఆటగాడికి గరిష్టంగా ఎంత మొత్తం చెల్లించాలనేది రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీటిలో ఏది తక్కువైతే అదే ఆ ఆటగాడి జీతం అవుతుంది:

జట్లు తమ టాప్ ప్లేయర్‌ను రిటైన్ చేసుకున్న గరిష్ట ధర (ప్రస్తుతం ఇది రూ. 18 కోట్లు).

గత మెగా వేలంలో పలికిన అత్యధిక ధర (ఉదాహరణకు రిషబ్ పంత్ – రూ. 27 కోట్లు).

ఇక్కడ రూ. 27 కోట్ల కంటే రూ. 18 కోట్లు తక్కువ కాబట్టి, విదేశీ ఆటగాళ్ల గరిష్ట జీతాన్ని రూ. 18 కోట్లుగా ఫిక్స్ చేశారు.

మిగిలిన రూ. 7.2 కోట్లు ఎవరికి వెళ్తాయి?..

KKR పరిస్థితి: కోల్‌కతా జట్టు తమ పర్సు నుంచి పూర్తి మొత్తం, అంటే రూ. 25.2 కోట్లు చెల్లించాల్సిందే. వారికి ఎలాంటి తగ్గింపు ఉండదు.

గ్రీన్ పరిస్థితి: కామెరూన్ గ్రీన్ రూ. 18 కోట్లు మాత్రమే తీసుకుంటాడు.

మిగిలిన మొత్తం: మిగిలిన రూ. 7.2 కోట్లు (25.2 – 18 = 7.2) బీసీసీఐకి వెళ్తాయి. ఈ డబ్బును ‘ప్లేయర్ వెల్ఫేర్ ఫండ్’ (Player Welfare Fund) కోసం ఉపయోగిస్తారు. ఇది మాజీ క్రికెటర్ల సంక్షేమం, క్రికెట్ అభివృద్ధికి ఖర్చు చేస్తారు.

ఈ రూల్ ఎందుకు?..

మెగా వేలంలో స్టార్ భారతీయ ఆటగాళ్లు (రోహిత్, కోహ్లీ, బూమ్రా వంటి వారు) రూ. 18 కోట్లకు రిటైన్ అవుతుంటే, మినీ వేలంలో వచ్చే విదేశీ ఆటగాళ్లు రూ. 20-25 కోట్లు ఎగరేసుకుపోవడం న్యాయం కాదని బీసీసీఐ భావించింది. అందుకే భారతీయ ఆటగాళ్ల గౌరవాన్ని, ఫ్రాంచైజీల ఆర్థిక క్రమశిక్షణను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకుంది.

కామెరూన్ గ్రీన్ రికార్డు సృష్టించినా, కొత్త రూల్ కారణంగా ఆర్థికంగా కొంత నష్టపోక తప్పదు. అయితే, రూ. 18 కోట్లు కూడా చిన్న మొత్తం కాదు! కానీ, ఈ రూల్ వల్ల భవిష్యత్తులో విదేశీ ఆటగాళ్లు మెగా వేలంలోనే ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంది.