IPL 2026 Auction: బేస్ ప్రైస్ రూ. 2 కోట్లేనని తీసిపడేసేరు.. ఖాతాలోకి ఏకంగా రూ. 20 కోట్లకు పైగానే.. ఎవరంటే?

ఈసారి వేలంలో కొంతమంది స్టార్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీల మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. ముఖ్యంగా రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వస్తున్న ముగ్గురు విదేశీ ఆటగాళ్లు.. తమకున్న క్రేజ్, ఇటీవలి ఫామ్ కారణంగా రూ. 20 కోట్లకు పైగా పలికే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

IPL 2026 Auction: బేస్ ప్రైస్ రూ. 2 కోట్లేనని తీసిపడేసేరు.. ఖాతాలోకి ఏకంగా రూ. 20 కోట్లకు పైగానే.. ఎవరంటే?
Ipl 2026 Auction

Updated on: Dec 02, 2025 | 1:34 PM

IPL 2026 Auction: ఐపీఎల్ 2026 (IPL 2026) మెగా ఆక్షన్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈసారి వేలంలో కొంతమంది స్టార్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీల మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. ముఖ్యంగా రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వస్తున్న ముగ్గురు విదేశీ ఆటగాళ్లు.. తమకున్న క్రేజ్, ఇటీవలి ఫామ్ కారణంగా రూ. 20 కోట్లకు పైగా పలికే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

1. కామెరాన్ గ్రీన్ (Cameron Green): ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ ఈ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాపై సెంచరీతో చెలరేగిన గ్రీన్, టీ20ల్లో 160కి పైగా స్ట్రైక్ రేట్‌తో దూసుకుపోతున్నాడు. మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేయడం, మిడిల్ ఆర్డర్ లేదా ఫినిషర్‌గా బ్యాటింగ్ చేయగలగడం అతని బలం. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రస్సెల్, వెంకటేష్ అయ్యర్ వంటి ఆల్ రౌండర్లను వదులుకున్న నేపథ్యంలో, తమ వద్ద ఉన్న భారీ పర్సుతో (రూ. 64 కోట్లకు పైగా) గ్రీన్ కోసం ఎంతవరకైనా వెళ్లే అవకాశం ఉంది.

2. డేవిడ్ మిల్లర్ (David Miller): ‘కిల్లర్ మిల్లర్’గా పిలవబడే దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ కోసం కూడా ఫ్రాంచైజీలు ఎగబడే ఛాన్స్ ఉంది. ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల ఫినిషర్ల కొరత ప్రస్తుతం చాలా జట్లకు ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వంటి జట్ల వద్ద భారీగా డబ్బు మిగిలి ఉంది. ఈ జట్లకు ఫినిషర్ అవసరం కూడా ఎక్కువగా ఉండటంతో, మిల్లర్ ధర అనూహ్యంగా రూ. 20 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా.

ఇవి కూడా చదవండి

3. డెవాన్ కాన్వే (Devon Conway): న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే టి20 క్రికెట్‌లో నిలకడకు మారుపేరు. అత్యంత వేగంగా 5000 టీ20 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లలో అతను ఒకడు. ఇన్నింగ్స్‌ను నిలబెట్టడంతో పాటు, అవసరమైనప్పుడు దూకుడుగా ఆడగలగడం కాన్వే ప్రత్యేకత. టాప్ ఆర్డర్‌ను బలోపేతం చేసుకోవాలనుకునే ఏ జట్టుకైనా కాన్వే ఒక అద్భుతమైన ఎంపిక. అందుకే అతని కోసం కూడా బిడ్డింగ్ వార్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

మొత్తానికి, ఈ ముగ్గురు ఆటగాళ్ల బేస్ ప్రైస్ తక్కువగానే ఉన్నా.. వారికున్న డిమాండ్, జట్ల అవసరాల దృష్ట్యా వేలంలో కాసుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..