IPL 2025: దండం రా దూత.! రంజుగా షాట్ ఆడిన రషీద్ భాయ్.. కట్ చేస్తే.. మడతెట్టేసిన మంచోడు

గుజరాత్, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రషీద్ ఖాన్ కొట్టిన నో లుక్ షాట్‌కు బంతి బౌండరీకి వెళ్తుందని అనుకుంటే.. యశస్వి జైస్వాల్ అద్భుతమైన క్యాచ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి.

IPL 2025: దండం రా దూత.! రంజుగా షాట్ ఆడిన రషీద్ భాయ్.. కట్ చేస్తే.. మడతెట్టేసిన మంచోడు
Gt Vs Rr

Updated on: Apr 10, 2025 | 12:35 PM

ఐపీఎల్ 2025 23వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ తన వంతు పాత్ర పోషించాడు.

7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రషీద్.. మొత్తంగా చివర్లో 4 బంతులు ఎదుర్కుని ఒక సిక్స్, ఒక ఫోర్‌తో 12 పరుగులు చేశాడు. ఆ రెండు బౌండరీలు అతడు రాయల్స్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే ఓవర్‌లో కొట్టడం గమనార్హం. కానీ అదే ఓవర్ 6వ బంతికి రషీద్ ఓ చిత్రవిచిత్రమైన షాట్ కొట్టేందుకు ప్రయత్నించి.. ఊహించని విధంగా అవుట్ అయ్యాడు. రషీద్ నో లుక్ షాట్ అతడికి బౌండరీ తెచ్చిపెడుతుందని అనుకుంటే.. యశ్వసి జైస్వాల్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 217 పరుగులు చేయగా.. టార్గెట్ చేధించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ 159 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో గుజరాత్ టైటాన్స్ 58 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడమే కాదు.. టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని అందుకుని పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..