
Uppal Stadium
ఐపీఎల్ ధనాధన్ మ్యాచ్‌లు.. క్రికెట్ ఫ్యాన్స్‌కి ఇదో సంబురం. టీమ్ ఏదైనా వేదిక ఎక్కడైనా.. ఇష్టమైన ఆటగాళ్ల కోసం అభిమానులు స్టేడియాలకు పోటెత్తుతారు. నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్.. క్రికెట్ లవర్స్‌కి ఐపీఎల్ మ్యాచ్‌లతో వచ్చే కిక్కే వేరు. ప్లేయర్ల బౌలింగ్, బ్యాటింగ్ పెర్ఫామెన్స్‌కి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతుంటారు. ఇప్పుడు వాళ్ల హుషారును మరింత పెంచేలా ప్లాన్ చేసింది బీసీసీఐ.
ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేసేందుకు వస్తోన్న తమన్
ఫస్ట్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ని చిత్తుగా ఓడించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. సెకండ్ ఫైట్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢీకొట్టబోతుంది. ఇవాళ రాత్రి ఏడున్నరకు మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమిస్తున్న ఈ మ్యాచ్ చూసేందుకు భారీగా తరలిరానున్నారు ప్రేక్షకులు. వాళ్లను మరింత ఎంటర్‌టైన్ చేసేందుకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వస్తున్నాడు. దేశవ్యాప్తంగా ఐపీఎల్‌కు హోస్ట్‌గా ఉన్న స్టేడియాల్లో మ్యాచ్‌లకి ముందు ఇదే తరహా సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్‌తో బీసీసీఐ ఈవెంట్స్ నిర్వహిస్తోంది.
ఉప్పల్‌లో మ్యాచ్ విత్ మ్యూజిక్
చెన్నై సూపర్ కింగ్స్ – ముంబై ఇండియన్స్ మ్యాచ్‌కి ముందు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో మ్యూజికల్ నైట్ నిర్వహించారు. ఇప్పుడు ఉప్పల్‌లో తమన్‌తో మ్యాచ్ విత్ మ్యూజిక్‌కి ప్లాన్ చేశారు. ఈ స్టార్ కంపోజర్ గ్రౌండ్‌కి వస్తే దుమ్మురేపడం ఖాయం. హిట్ సాంగ్స్‌తో ఆడియెన్స్‌కి కిక్ ఇవ్వడం పక్కా. ఓ వైపు ఆటగాళ్ల విన్యాసాలు.. అంతకుముందే తమన్ మ్యూజిక్.. ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ అనే చెప్పొచ్చు.
మ్యాచ్ మొత్తం అభిమానుల హుషారు
మ్యాచ్ నడుస్తుండగా అభిమానులు ఎలాగూ ఎంజాయ్ చేస్తారు. కానీ అంతకుముందే మ్యూజిక్‌తో మొదలెడితే.. ఆ హుషారు మ్యాచ్ మొత్తం కంటిన్యూ అవుతుందన్నది బీసీసీఐ లెక్క. అంతేకాదూ ఈవెంట్లతో టికెట్ల సంఖ్య పెరిగితే స్టేడియంలో ఆ క్రౌడే వేరు. అరుపులు, కేకలతో స్టేడియం మార్మోగిపోతుంటే మ్యాచ్‌కి అంతకుమించి ఊపు వస్తుందని లెక్కలేసుకుంటోంది.
ఐపీఎల్ మ్యాచ్‌లలో 200 ప్లస్ స్కోర్లు
ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లలో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. ఆటగాళ్లు ఎవరికి వారే తగ్గేదేలే అన్నట్టుగా ఆడుతున్నారు. ఇప్పటిదాకా చెన్నై – ముంబై మ్యాచ్ మినహా మిగతా వాటిలో 200 ప్లస్ స్కోర్లు నమోదయ్యాయి. మరోవైపు ఇంపాక్ట్ ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. ఒకప్పుడు సీనియర్లు, ఎక్స్‌పర్ట్‌లు ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్.. అనవసరమని కొట్టిపడేశారు. కానీ ఇప్పుడు వాళ్లే రాణిస్తున్నారు. మ్యాచ్ విన్నర్లుగా మారుతున్నారు. తమ జట్లకు విజయాన్నందిస్తున్నారు. ఇక మరికొన్ని గంటల్లో జరిగే SRH – LSJ మధ్య మ్యాచ్‌లో ఏ బ్యాటర్ విధ్వంసం సృష్టిస్తాడు.. ఏ బౌలర్ మ్యాచ్‌ని మలుపు తిప్పుతాడో అన్న ఉత్కంఠ ఫ్యాన్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.