
బీసీసీఐ రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. మార్చి 22న ఈ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత అంటే ఫిబ్రవరి 23న ఐపీఎల్ లో ది మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్స్ అయిన ముంబై, చెన్నై జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్న ఈ ఇరు జట్లు ఇప్పుడు ఆరో టైటిల్ పై కన్నేశాయి. కాబట్టి ఈ మ్యాచ్ హోరా హోరీ పోరు ఖాయమనిపిస్తోంది. కాగా గత సీజన్ లో పేలవమైన ఆటతీరుతో అభిమానులను నిరాశ పరిచింది ముంబై ఇండియన్స్. అందుకే ఈ సారి టైటిల్ గెలవాలన్న కసితో మైదానంలోకి అడుగు పెట్టనుంది. ముంబై మ్యాచ్ ల విషయానికి వస్తే.. ఈ 18వ సీజన్‌లో హార్దిక్ సేన 5 జట్లతో చెరో 2 మ్యాచ్‌లు ఆడనుంది. మరో 4 జట్లతో ఒక్కొక్క మ్యాచ్ ఆడనుంది. చెన్నై, హైదరాబాద్, గుజరాత్ ఢిల్లీ, లక్నోతో చెరో 2 మ్యాచ్‌లు ఆడనుంది ముంబై. అదే సమయంలో రాజస్థాన్, పంజాబ్, బెంగళూరు, కోల్‌కతాతో ఒక్కొక్క మ్యాచ్ లో తలడనుంది. ఇక మొత్తం 14 మ్యాచ్‌లలో 7 మ్యాచ్‌లను సొంత మైదానంలో ఆడనుండగా, మిగిలిన 7 మ్యాచ్‌లను ఇతర నగరాల్లో ఆడనుంది.
𝑵𝒂𝒈𝒂𝒓 𝒎𝒆𝒊𝒏 𝒅𝒉𝒊𝒏𝒅𝒐𝒓𝒂 𝒑𝒊𝒕𝒘𝒂 𝒅𝒐, 𝒎𝒂𝒎𝒂 🗣
ఇవి కూడా చదవండి🗓 𝗧𝗮𝘁𝗮 𝗜𝗣𝗟 𝟮𝟬𝟮𝟱 schedule aa gaya hai! #MumbaiMeriJaan #MumbaiIndians #TATAIPL pic.twitter.com/HoBuM6a8UT
— Mumbai Indians (@mipaltan) February 16, 2025
కాగా ఐపీఎల్ మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ మొత్తం 5 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఆ తరువాత RTM ద్వారా మెగా వేలం నుంచి ఒక ఆటగాడిని కొనుగోలు చేసింది. ఆతర్వాత వేలం ద్వారా 17 మంది కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేసింది.
జస్‌ప్రీత్ బుమ్రా (18 కోట్లు), హార్దిక్ పాండ్యా (16.35 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (16.35 కోట్లు), రోహిత్ శర్మ (16.30 కోట్లు), తిలక్ వర్మ (8 కోట్లు)
ట్రెంట్ బౌల్ట్ (12.5 కోట్లు), దీపక్ చాహర్ (9.25 కోట్లు), విల్ జాక్స్ (5.25 కోట్లు), నమన్ ధీర్ (5.25 కోట్లు) (RTM), ముజీబ్ ఉర్ రెహమాన్ (గాయపడిన అల్లా గజన్‌ఫర్ స్థానంలో), మిచెల్ సాంట్నర్ (2 కోట్లు), ర్యాన్ రికెల్టన్ (1 కోటి), లిజాద్ విలియమ్స్ (75 లక్షలు), రీస్ టోప్లీ (75 లక్షలు), రాబిన్ మింజ్ (65 లక్షలు), కర్ణ్ శర్మ (50 లక్షలు), విఘ్నేష్ పుత్తూర్ (30 లక్షలు), అర్జున్ టెండూల్కర్ (30 లక్షలు), బెవాన్ జాకబ్స్ (30 లక్షలు), వి. సత్యనారాయణ (30 లక్షలు), రాజ్ అంగద్ బావా (30 లక్షలు), కెఎల్ శ్రీజీత్ (30 లక్షలు), అశ్వని కుమార్ (30 లక్షలు)
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..