
Virat Kohli: భారత పురుషుల జట్టు సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా విడుదలైంది. ఇందులో మొత్తం 34 మంది ఆటగాళ్లు ఉన్నారు. చాలా మంది యువ ఆటగాళ్ల అదృష్టం ప్రకాశించింది. అయితే, చాలా మంది ఆటగాళ్లకు ఒప్పందం నుంచి బయటపడే మార్గం చూపించారు. బీసీసీఐ దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీని A+ ప్లస్ కేటగిరీలో ఉంచింది. టీ20 నుంచి రిటైర్ అయిన తర్వాత కోహ్లీ గ్రేడ్ తగ్గిస్తారని అంతా భావించారు. కానీ, ఇది జరగలేదు. అయితే, ఇక్కడొక ట్విస్ట్ ఇచ్చింది బీసీసీఐ. కింగ్ కోహ్లీకి క్లోజ్ ఫ్రెండ్‌కి మాత్రం బిగ్ షాకిచ్చింది. బీసీసీఐ మరోసారి ఆ ఆటగాడిని విస్మరించి, అతనికి బయటపడే మార్గాన్ని చూపించింది. ఆ ఆటగాడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ 2025-26 కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 21న ప్రకటించిన సంగతి తెలిసిందే. సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో మొత్తం 34 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఇందులో యువ ఆటగాళ్లతో పాటు సీనియర్ ఆటగాళ్లకు కూడా అవకాశం కల్పించారు.
గత సంవత్సరం భారతదేశం తరపున అరంగేట్రం చేసిన ప్లేయర్‌కు మొదటిసారిగా సెంట్రల్ కాంట్రాక్ట్‌లో అవకాశం లభించింది. కానీ, విరాట్ కోహ్లీకి సన్నిహితుడిగా భావించే లెగ్ స్పిన్నర్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈసారి ఆయనను సెంట్రల్ కాంట్రాక్ల్‌లో చేర్చవచ్చని వార్తలు వచ్చాయి. కానీ, గతసారి లాగే ఈసారి కూడా చాహల్‌కు బ్యాడ్ న్యూస్ అందించింది బీసీసీఐ.
యుజ్వేంద్ర చాహల్ భారత వికెట్ తీసే బౌలర్లలో ఒకడిగా పేరుగాంచాడు. కానీ, గత కొన్ని సంవత్సరాలుగా, స్పిన్ బౌలర్‌గా అతనికి టీం ఇండియా తలుపులు మూసుకుపోయాయి. ఒక టోర్నమెంట్‌లో, ద్వైపాక్షిక సిరీస్‌లలో ఒకదాని తర్వాత మరొకటిగా బీసీసీఐ అతన్ని విస్మరిస్తోంది. 2023 నుంచి అతను భారత జట్టులో చోటు దక్కించుకోలేదు. దీంతో యుజ్వేంద్ర చాహల్ కెరీర్ ముగిసిపోయిందనే ప్రశ్న అభిమానులు లేవనెత్తుతున్నారు? వరుణ్ చక్రవర్తి, రవి బిశ్వాయ్, కుల్దీప్ యాదవ్ కారణంగా, అతను జట్టులోకి తిరిగి రావడం కష్టంగా మారింది.
భారతదేశం తరపున యుజ్వేంద్ర చాహల్ 72 వన్డేల్లో 121 వికెట్లు పడగొట్టాడు. ఇందులో అతను 4 వికెట్లను 5 సార్లు, 5 వికెట్లను 2 సార్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, అతను 80 టీ20 మ్యాచ్‌ల్లో 96 వికెట్లు పడగొట్టాడు. ఈ కాలంలో, అతను ఒకసారి ఐదు వికెట్లు తీయడంలో సక్సెస్ అయ్యాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..