IPL 2024: 8 మ్యాచుల్లో 13 వికెట్లు.. ఈ టీమిండియా బౌలర్‌కు టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ ఖరారు అయినట్టేనా?

ఒకవైపు ఐపీఎల్ 2024 మ్యాచ్ లు హోరాహోరీగా జరుగుతున్నాయి. మరోవైపు టీ20 ప్రపంచకప్ ఉత్కంఠ రేపుతోంది. ఈ మెగా టోర్నీ కోసం ఈ నెలాఖరులోగా టీమిండియాను ప్రకటించనున్నారు. 10-11 మంది ఆటగాళ్ల పేర్లను ఇప్పటికే ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఆగస్టు 2023లో వెస్టిండీస్‌తో తన చివరి అంతర్జాతీయ టీ20 ఆడిన

IPL 2024: 8 మ్యాచుల్లో 13 వికెట్లు.. ఈ టీమిండియా బౌలర్‌కు టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ ఖరారు అయినట్టేనా?
Team India
Follow us

|

Updated on: Apr 24, 2024 | 7:54 AM

ఒకవైపు ఐపీఎల్ 2024 మ్యాచ్ లు హోరాహోరీగా జరుగుతున్నాయి. మరోవైపు టీ20 ప్రపంచకప్ ఉత్కంఠ రేపుతోంది. ఈ మెగా టోర్నీ కోసం ఈ నెలాఖరులోగా టీమిండియాను ప్రకటించనున్నారు. 10-11 మంది ఆటగాళ్ల పేర్లను ఇప్పటికే ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఆగస్టు 2023లో వెస్టిండీస్‌తో తన చివరి అంతర్జాతీయ టీ20 ఆడిన యుజ్వేంద్ర చాహల్‌కు కూడా ఆ జట్టులో అవకాశం లభిస్తుందా? చాహల్ టీమ్ ఇండియాకు దూరమై చాలా రోజులైంది కాబట్టి సహజంగానే ఈ ప్రశ్నతలెత్తుతోంది. అలాగే ఐపీఎల్ 2024లో ప్రదర్శన ను ప్రామాణికంగా తీసుకుని టీ20 ప్రపంచకప్ లో స్థానం కల్పించడం సమంజసమేనా? అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. టీ20 ప్రపంచకప్ 2024 కోసం టీమ్ ఇండియాలో యుజ్వేంద్ర చాహల్ ఎంపికయ్యే అవకాశాలు ఏమిటి? ఈ విషయమై భారత మాజీ వికెట్ కీపర్, టీమిండియా సెలక్టర్ సబా కరీమ్‌ను ప్రశ్నించగా.. ఈ విషయం సెలెక్టర్లకు తలనొప్పిగా మారిందని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో సబా కరీం నిరంతరం వ్యాఖ్యానిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, అతను చాహల్ బౌలింగ్‌ను కూడా చాలా దగ్గరగా చూశాడు. ఈ నేపథ్యంలో చాహల్ ఎంపికపై తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశాడు.

కేవలం ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగానే ఏ ఆటగాడు సెలక్షన్ పొందలేడని సబా కరీమ్ అన్నాడు. రవి బిష్ణోయ్‌ని మరోసారి ప్రస్తావించిన అతను, టీమ్‌ఇండియాలో అవకాశం వచ్చినప్పుడు చాహల్ బాగా రాణించాడని చెప్పాడు. టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు కోసం చాహల్, బిష్ణోయ్ ల మధ్య గట్టి పోటీ ఉందన్నాడు కరీమ్. కాగా టీ 20 ప్రపంచకప్ జట్టులో యుజ్వేంద్ర చాహల్‌ను ఉండాలని మణిందర్ సింగ్ సూచించాడు. అతనితో పాటు అక్షర్ పటేల్ ను కూడా ఎంపిక చేయాలని సెలెక్లరకు సూచించారీ మాజీ క్రికెటర్.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ లో 200 వికెట్లు. .ఏకైక బౌలర్ గా రికార్డు..

యుజువేంద్ర చాహల్ లేటెస్ట్ ట్వీట్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles