ఐపీఎల్ 17వ ఎడిషన్ ప్రారంభానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ ధనాధన్ క్రికెట్ టోర్నమెంట్ మార్చి నుండి మే వరకు జరుగుతుంది. దీని కోసం అన్ని ఫ్రాంచైజీలు ప్రిపరేషన్‌లో నిమగ్నమై ఉన్నాయి. అయితే ఆటగాళ్ల గాయాలు ఫ్రాంచైజీలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. గాయపడిన ఆటగాళ్ల స్థానంలో కొత్త ఆటగాళ్ల ఎంపిక టీమ్ మేనేజ్‌మెంట్లకు తలకు మించిన భారమవుతోంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ ప్రారంభానికి ముందు గాయపడిన లక్నో స్టార్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ స్థానంలో వెస్టిండీస్ జట్టు నయా సెన్సేషన్, గబ్బా టెస్టు హీరో రువారీ షమర్ జోసెఫ్ ను జట్టులోకి తీసుకున్నారు. ఇటీవల గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు రెండవ ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టాడు జోసెఫ్. దీంతో 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు విజయం సాధించింది. అప్పటి నుండి ఈ విండీస్ బౌలర్ పేరు మార్మోగిపోతోంది. త్వరలోనే అతనిని ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఐపిఎల్‌లో చూడవచ్చని అభిమానులు ఆశించారు. ఇప్పుడు అదే జరిగింది.
షామర్ జోసెఫ్ ఇప్పుడు IPL 2024లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఆడబోతున్నాడు. మార్క్ వుడ్ స్థానంలో జోసెఫ్ లక్నో జట్టులోకి వచ్చాడు. ఇందుకోసం జోసెఫ్ రూ.3 కోట్లు అందుకున్నారు. జోసెఫ్‌కి ఇది తొలి ఐపీఎల్ సీజన్. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో షమర్ జోసెఫ్ కూడా తన టెస్టు అరంగేట్రం చేసాడు మరియు కేవలం రెండు టెస్ట్ మ్యాచ్‌ల తర్వాత ఓవర్ నైట్ హీరోగా మారిపోయాడు. షమర్ జోసెఫ్ తన కెరీర్‌లో తొలి బంతికే స్టీవ్ స్మిత్‌ను అవుట్ చేశాడు. దీని తర్వాత జోసెఫ్ అదే ఇన్నింగ్స్‌లో మరో 4 వికెట్లు పడగొట్టాడు. అయితే అంతకంటే ముందే జోసెఫ్ కూడా 11వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. కాలికి దెబ్బ తగిలినా ఆస్ట్రేలియా భీకర బౌలర్లను ఎదుర్కొంటూ 36 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసి ఫేమస్ అయ్యాడు.
🚨 NEWS 🚨: Lucknow Super Giants name Shamar Joseph as replacement for Mark Wood. #TATAIPL
Details 🔽https://t.co/RDdWYxk2Vp
— IndianPremierLeague (@IPL) February 10, 2024
కష్టాలతో కూడిన ప్రయాణం..షామర్ జోసెఫ్ ప్రయాణం వెనక కన్నీటి కష్టాలున్నాయి. గయానాలోని చిన్న గ్రామమైన బరాకరలో జన్మించిన జోసెఫ్ ఐదుగురు సోదరులు, ముగ్గురు సోదరీమణులతో కూడిన పెద్ద కుటుంబంలో పెరిగాడు. న్యూ ఆమ్‌స్టర్‌డామ్ నగరానికి చేరుకోవడానికి 2 రోజుల పాటు పడవలో ప్రయాణించాల్సి వచ్చింది. అయితే ఈ ఆటగాడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. జోసెఫ్ తరచుగా టేప్-బాల్ క్రికెట్ ఆడేవాడు. అయితే ఇప్పుడు ఈ ఆటగాడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ ఐపీఎల్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు.
Shamar, we’re so happy to have you 💙🔥@SJoseph70Guyana joins our squad for IPL 2024, replacing Mark Wood 🤝 pic.twitter.com/YPfGQZB18N
— Lucknow Super Giants (@LucknowIPL) February 10, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..