
టీమిండియాతో రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ వరల్డ్ కప్‌తో ముగిసింది. మరి దీని తర్వాత రాహుల్ టీం ఇండియా కోచ్‌గా కొనసాగుతారా లేదా అనే దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ద్రావిడ్ టీమ్ ఇండియాతో కొనసాగకపోతే, కొన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు అతనిని చేర్చుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ద్రవిడ్ గతంలో కూడా ఐపీఎల్‌కు కోచ్‌గా పనిచేశాడు. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్)లకు మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ ద్రవిడ్‌ను తమ జట్టులోకి చేర్చుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. లక్నో 2022 నుంచి ఐపీఎల్‌లోకి అడుగుపెట్టింది. ఈ ఫ్రాంచైజీ రెండు సంవత్సరాలుగా ఉంది. ఈ ఫ్రాంచైజీ రెండు సీజన్‌లలో ప్లేఆఫ్‌లకు చేరుకుంది. ఈ సమయంలో, గౌతమ్ గంభీర్ జట్టుకు మెంటార్‌గా ఉన్నాడు. అయితే ఇటీవల గంభీర్ లక్నోను వదిలి తన తన పాత జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు వెళ్లిపోయాడు.
నివేదికల ప్రకారం ద్రవిడ్ పదవీకాలాన్ని పొడిగించడం లేదా కోచ్ పదవికి మళ్లీ దరఖాస్తు చేసుకోవడంపై బీసీసీఐ ఏమీ చెప్పలేదు. ఈ విషయంపై ఇరువర్గాల నుంచి ఏమీ తేలలేదు. ద్రవిడ్ 2021 నుంచి టీమ్ ఇండియా కోచ్‌గా కొనసాగుతున్నాడు. అతను ఈ పదవిని స్వీకరించాలనుకోలేదు. అయితే అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అతనిని ఒప్పించాడు. మరి ఈసారి ద్రవిడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. టీమ్ ఇండియాతో కలిసి ఉన్నప్పుడు ద్రవిడ్ చాలా బిజీగా ఉన్నాడు. ఐపీఎల్‌కి వస్తే మాత్రం రెండు మూడు నెలలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ కూడా ద్రవిడ్‌ను తమ మెంటార్‌గా మార్చడానికి ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ద్రావిడ్ కోచ్ సారథ్యంలో టీమిండియా వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరినా, టైటిల్ గెలవలేకపోయింది. ప్రస్తుతం, భారత జట్టు ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌ను ఆడుతోంది, అయితే ద్రవిడ్ పదవీకాలం ముగిసినందున అతను జట్టుతో లేడు. ప్రస్తుతం ఎన్‌సీఏ అధిపతి వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. ఒకవేళ ద్రవిడ్ టీం ఇండియా కోచ్‌గా పదవీకాలాన్ని పొడిగించకపోతే లక్ష్మణ్‌కు ఈ బాధ్యతను అప్పగించవచ్చని భావిస్తున్నారు.
Rahul Dravid’s could serve as the mentor for either LSG or RR in the IPL 2024.#IPL #IPLTrade #IPL2024 #IPL2024Auction #IPLAuction #Cricket #CricketMantri #VineethNagarjun #CricketTwitter #HardikPandya #RahulDravid #Dravid #LSG #LucknowSuperGiants #RR #RajasthanRoyals pic.twitter.com/rhERVnga4s
— Cricket Mantri (@VineethNagarjun) November 25, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..